సొంతూరికి రైల్లో రాబోతున్న రాష్ట్రప‌తి రాంనాథ్

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రైలు మార్గం ద్వారా సొంతూరుకి వెళ్ల‌బోతున్నారు. ఉత్తరప్రదేశ్‌ కన్పూర్‌లోని తన స్వస్థలం పారౌఖ్‌కు ప్రత్యేక రైలులో ప్ర‌యాణించ‌నున్నారు. ఈ పర్యటనలో ఆయన పరిచయస్తులతో పాటు కలిసి చదువుకున్న చిన్న‌నాటి స్నేహితుల‌ను కలువనున్నారు. అయితే, 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలులో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందే రాంనాథ్‌ కోవింద్‌ సొంత గ్రామానికి వెళ్లాలనుకున్నా.. కరోనా మహమ్మారి కారణంగా సాధ్యం కాలేదని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. అయితే ప్రత్యేక […]

సొంతూరికి రైల్లో రాబోతున్న రాష్ట్రప‌తి రాంనాథ్

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రైలు మార్గం ద్వారా సొంతూరుకి వెళ్ల‌బోతున్నారు. ఉత్తరప్రదేశ్‌ కన్పూర్‌లోని తన స్వస్థలం పారౌఖ్‌కు ప్రత్యేక రైలులో ప్ర‌యాణించ‌నున్నారు. ఈ పర్యటనలో ఆయన పరిచయస్తులతో పాటు కలిసి చదువుకున్న చిన్న‌నాటి స్నేహితుల‌ను కలువనున్నారు. అయితే, 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలులో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందే రాంనాథ్‌ కోవింద్‌ సొంత గ్రామానికి వెళ్లాలనుకున్నా.. కరోనా మహమ్మారి కారణంగా సాధ్యం కాలేదని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

అయితే ప్రత్యేక రైలు శుక్రవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి.. సాయంత్రం కాన్పూర్‌ చేరుకుంటుంది. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురాల వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. ఇక్కడ నాటి పాత పరిచయస్తులను రాష్ట్రపతి కలువనున్నారు. గ్రామాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఈ నెల 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో లక్నోకు రాష్ట్రప‌తి రాంనాథ్
చేరుకుంటారు. పర్యటన అనంతరం తిరిగి 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు.

Readmore:బార్డ‌ర్ లోభారిగా హెరాయిన్‌