శ్రీవారి భక్తులు వారి దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పించిన తితిదే
విధాత:తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులు వారి దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పించింది తితిదే.టికెట్లు పొంది కరోనా ప్రభావంతో స్వామి దర్శనానికి భక్తులు రాలేకపోతున్నట్టు తితిదే గుర్తించింది.దీంతో జూన్ 30 వరకు ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను పొందిన యాత్రికులు వారి దర్శన తేదీని మార్చుకోవచ్చని తితిదే ప్రకటించింది.ఏడాది సమయంలో ఎప్పుడైనా దర్శన సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించిన తితిదే.. ఒక్కసారి మాత్రమే మార్పునకు అవకాశం ఇచ్చింది.