మళ్లీ 2007 ఫార్ములా… ‘మాయ’ చేస్తుందా?

విధాత‌,లక్నో : రాజకీయంగా దెబ్బతిన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అవ్వడమే కాకుండా 2007 నాటి బంపర్ ఫార్ములాను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ నెల 23 న బ్రాహ్మణ సామాజిక వర్గంతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23 అయోధ్య నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తామని, దీనికి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. మొదటి విడతలో ఆరు జిల్లాల్లో ఈ […]

మళ్లీ 2007 ఫార్ములా… ‘మాయ’ చేస్తుందా?

విధాత‌,లక్నో : రాజకీయంగా దెబ్బతిన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అవ్వడమే కాకుండా 2007 నాటి బంపర్ ఫార్ములాను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ నెల 23 న బ్రాహ్మణ సామాజిక వర్గంతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23 అయోధ్య నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తామని, దీనికి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. మొదటి విడతలో ఆరు జిల్లాల్లో ఈ సమ్మేళనాలు నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఈ సమ్మేళనాలను నిర్వహించేలా వ్యూహం రచించారు. ఇదే పనిని మాయవతి 2007 నాటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను తెరపైకి తెచ్చి లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా బ్రాహ్మణ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి, లబ్ధి పొందాలని వ్యూహం వేశారు. 2007 లో ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులకు బీఎస్పీ తరపున టిక్కెట్లు కేటాయించి, సంచలనం సృష్టించారు. భిన్నమైన ధ్రువాలున్న ’బ్రాహ్మణ, దళిత్, ముస్లిం’ అన్న సోషల్ ఇంజినీరింగ్‌ చేశారు. ఇందులో సఫలం కూడా చెందారు. 403 సీట్లకు గాను 206 సీట్లను సాధించి విజయం కేతనం ఎగురవేసింది. ఇప్పుడు కూడా ఇదే ఫార్ములాతో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని మాయావతి వ్యూహం వేశారు.
ఎవరీ సతీశ్ చంద్ర మిశ్రా..? : వృత్తి రీత్యా న్యాయవాది. ప్రస్తుతం బీఎస్పీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో మాయావతి కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. మాయావతి వేసే ప్రతి రాజకీయ వ్యూహంలోనూ మిశ్రా ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే, సతీశ్ మిశ్రా ఓకే అంటేనే మాయావతి రాజకీయంగా ముందడుగు వేస్తుందన్న ప్రచారమూ ఉంది. కేవలం రాజకీయ పరంగా కాదు, పార్టీ విధాన నిర్ణయం, ఇబ్బందులు, కార్యకర్తలతో, ఇతర పార్టీలతో డీల్ చేసే వ్యవహారాన్ని కూడా మిశ్రాయే స్వయంగా చూసుకుంటారు. బీఎస్పీలో ‘చాణక్య’ పాత్ర పోషిస్తుంటారు. 2007 లో బీఎస్పీ బ్రాహ్మణుల వైపు పూర్తిగా మొగ్గుచూపాలన్న విధానపరమైన నిర్ణయం కూడా ఈ మిశ్రాదే. మిశ్రా వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిన మాయావతి… 2007 లో బంపర్ మెజారిటీ సాధించారు. మళ్లీ ఇప్పుడు సతీశ్ చంద్ర మిశ్రా 2007 ఫార్ములాను అమలు చేయాలని మాయావతికి సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.