వామ్మో.. కోట్లు తింటున్న దోమలు
ఫాగింగ్ కోసం ఇష్టానుసారంగా జిహెచ్ఎంసీ ఖర్చు ఆర్టీఐతో ప్రశ్నించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ భాగ్యనగరంలో దోమలు పెరుగుతున్నాయి.. వాటి నివారణ కోసం కోట్ల రూపాయలు కరిగిపోతున్నాయి.. దోమల నివారణ కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు ఏమవుతున్నాయో మాత్రం తెలియదు.. జీహెచ్ఎంసీ ఖర్చు చేసే నిధులు దోమలే మింగుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. నగరంలో దోమల వ్యాప్తి నివారణకు జీహెచ్ఎంసీ ఏం ప్రచారం చేస్తుందో తెలియదు.. ఎన్ని కోట్ల నిధులు ఖర్చు పెడుతుందో తెలియదు.. అడిగే […]

- ఫాగింగ్ కోసం ఇష్టానుసారంగా జిహెచ్ఎంసీ ఖర్చు
- ఆర్టీఐతో ప్రశ్నించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్
భాగ్యనగరంలో దోమలు పెరుగుతున్నాయి.. వాటి నివారణ కోసం కోట్ల రూపాయలు కరిగిపోతున్నాయి.. దోమల నివారణ కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు ఏమవుతున్నాయో మాత్రం తెలియదు.. జీహెచ్ఎంసీ ఖర్చు చేసే నిధులు దోమలే మింగుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. నగరంలో దోమల వ్యాప్తి నివారణకు జీహెచ్ఎంసీ ఏం ప్రచారం చేస్తుందో తెలియదు.. ఎన్ని కోట్ల నిధులు ఖర్చు పెడుతుందో తెలియదు.. అడిగే వారు లేనంత వరకు కోట్లు నీళ్లలా కరిగిపోతూనే ఉంటాయి.. ప్రతి సంవత్సరం దోమల నివారణకు కోట్లలో ఖర్చు అవుతున్నట్లు రికార్డుల్లో మాత్రం భద్రంగా ఉంటాయి.. విడుదలైన నిధులు కరిగిపోతాయి.. కాని ఎక్కడ ఒక్క దోమ చావదు. -(ఉన్నమాట)
హైదరాబాద్ నగరంలోని దోమల ఫాగింగ్ కోసం జీహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు చేస్తోందనే విషయాలను తెలుసుకోవడానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సమాచారహక్కు చట్టం ద్వారా ప్రశ్నించింది.. అందుకు జీహెచ్ఎంసీలో చీఫ్ ఎంటమాలజిస్టు 2020-21, 2021 నుంచి 2022 ఇప్పటివరకు ఎన్ని నిధులు విడుదల చేశారో, ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలు వెల్లడించారని సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణకు పలు ప్రాంతాల్లో దోమల ఫాగింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుకు ఏరియాల వారీగా దోమలను నివారించడానికి, అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి ఏరియాల వారీగా సిబ్బంది క్రమం తప్పకుండా పని చేస్తున్నారని వెల్లడించారు.
2020-21, 2021-22 సంవత్సరం ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలోని దోమల నివారణ ఫాగింగ్ కోసం 34కోట్ల, 25లక్షల, 69వేల 90 రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
సంవత్సరన్నర కాలంలోనే దోమల ఫాగింగ్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.. ప్రాంతాల వారీగా నెలకు ఎన్నిసార్లు ఫాగింగ్ చేస్తారో మాత్రం పూర్తి సమాచారం ఇవ్వలేదని వారు తెలిపారు. దోమల నివారణకు ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నా దోమల బెడద మాత్రం తగ్గడం లేదు, అంటువ్యాధుల వ్యాప్తి ఆగడం లేదు