ఆలయ చైర్మన్కు సత్కారం వెల్లివిరిసిన సమైక్య భావం విధాత, వరంగల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచురాజుపల్లి శివారు కొండపై కొలువైన అభయాంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ వర్గాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటూ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో గురువారం ముస్లిం సోదరులు పాల్గొని తమ సమైక్య భావాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత, మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావును ముస్లిం సోదరులు సత్కరించి సహృదయతను […]
విధాత, వరంగల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచురాజుపల్లి శివారు కొండపై కొలువైన అభయాంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ వర్గాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటూ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యారు.
ఈ ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో గురువారం ముస్లిం సోదరులు పాల్గొని తమ సమైక్య భావాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత, మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావును ముస్లిం సోదరులు సత్కరించి సహృదయతను చాటుకున్నారు.
ముస్లిం సోదరుల స్పందనను చూస జాతీయ సమైక్య భావానికి నిదర్శనమని పలువురు అన్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాలను ఎంపీ కవిత, ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, డిఎస్ రవిచంద్ర తదితరులు సందర్శించారు.