మ‌రింత ఆల‌స్యం కానున్న‌నీర‌వ్ మోదీ అప్ప‌గింత

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నీర‌వ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి సమ్మతిస్తూ గత నెల బ్రిటన్‌ హోంమంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు ఇవ్వ‌గా.. ఆ ఉత్త‌ర్వుల‌పై హైకోర్టులో సవాల్‌ చేయడానికి అనుమతించాలంటూ నిందితుడు ఇటీవలే అప్పీల్‌ చేసుకున్నారు. నీరవ్ అప్పీల్‌ను హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించి, హోంమంత్రి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేయడానికి తగిన కారణాలు ఆ […]

మ‌రింత ఆల‌స్యం కానున్న‌నీర‌వ్ మోదీ అప్ప‌గింత

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నీర‌వ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి సమ్మతిస్తూ గత నెల బ్రిటన్‌ హోంమంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు ఇవ్వ‌గా.. ఆ ఉత్త‌ర్వుల‌పై హైకోర్టులో సవాల్‌ చేయడానికి అనుమతించాలంటూ నిందితుడు ఇటీవలే అప్పీల్‌ చేసుకున్నారు.

నీరవ్ అప్పీల్‌ను హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించి, హోంమంత్రి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేయడానికి తగిన కారణాలు ఆ అప్పీల్‌లో ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. దానిపై నీరవ్‌కు అనుకూలంగా హైకోర్టు జడ్జి నిర్ణయం తీసుకుంటే, అప్పుడు తమ అప్పీల్‌పై విచారణ చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరవచ్చు. అయితే ఈ న్యాయ ప్రక్రియ ముగియడానికి కాల పరిమితి ఏమీ ఉండదు. ఇది కొన్ని నెలలపాటు కొనసాగవ‌చ్చు. కాబట్టి నీరవ్‌ను భారత్‌కు రప్పించే విషయంలో మ‌రింత ఆల‌స్యం కానుంది.