దేశ ద్రోహం చట్టం అవసరం లేదు: సుప్రీం కోర్టు
విధాత,న్యూఢిల్లీ: దేశంలో రాజద్రోహం/దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే అది వలసవాదుల కాలంనాటి చట్టమని, అది ఇప్పుడు మనకు అవసరమా? అని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ సుప్రీం కోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది.‘అది బ్రిటీష్‌కాలం నాటిదని,అప్పట్లో గాంధీ లాంటి సమరయోధులను నిలువరించేందుకు బ్రిటిష్‌వాళ్లు ఆ చట్టం(ఐపీసీ సెక్షన్ 124-ఎ) తీసుకొచ్చారని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా ఆ వలస చట్టం మనకు అవసరమా?’ అని సుప్రీం కోర్టు ప్రధాన […]

విధాత,న్యూఢిల్లీ: దేశంలో రాజద్రోహం/దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే అది వలసవాదుల కాలంనాటి చట్టమని, అది ఇప్పుడు మనకు అవసరమా? అని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ సుప్రీం కోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘అది బ్రిటీష్‌కాలం నాటిదని,అప్పట్లో గాంధీ లాంటి సమరయోధులను నిలువరించేందుకు బ్రిటిష్‌వాళ్లు ఆ చట్టం(ఐపీసీ సెక్షన్ 124-ఎ) తీసుకొచ్చారని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా ఆ వలస చట్టం మనకు అవసరమా?’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, కేంద్రాన్ని ప్రశ్నించారు. సెడిషన్ లా(దేశద్రోహ చట్టం) చెల్లుబాటును పరిశీలిస్తామని స్పష్టం చేస్తూనే.. కేంద్రం నుంచి వివరణ కోరింది అత్యున్నత న్యాయస్థానం.
రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌జీ వోంబాట్కెరె.. ఐపీసీలోని 124-ఎ సెక్షన్‌ను(దేశద్రోహం నేరం కింద కేసు) వ్యతిరేకిస్తూ.. అది రాజ్యాంగ విరుద్ధమని దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. మరోవైపు దేశ ద్రోహం చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా పిటిషన్లు దాఖలయ్యానని, వాటన్నింటిని ఒకేసారి విచారణకు స్వీకరిస్తామని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ వెల్లడించింది. అంతేకాదు ఇదొక ప్రమాకరమైన అంశమని అభివర్ణిస్తూ.. బాధ్యతారాహిత్యంగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి రమణ వ్యాఖ్యానించారు.