వరంగల్: రైతుకు భ‌రోసా రైతు బంధు: మంత్రి ఎర్ర‌బెల్లి

ఏనుమాములలో పోలీస్ స్టేషన్ ప్రారంభం విధాత, వరంగల్: రైతులకు భరోసా కోసం రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. రైతులు బాగు పడితేనే మన రాష్ట్రం బాగు పడుద్దని సీఎం ఆలోచనగా వివరించారు. ఆసియాలోనే అతిపెద్దైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో బుధవారం నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు రైతులకు, వ్యాపారాస్తులకు […]

వరంగల్: రైతుకు భ‌రోసా రైతు బంధు: మంత్రి ఎర్ర‌బెల్లి
  • ఏనుమాములలో పోలీస్ స్టేషన్ ప్రారంభం

విధాత, వరంగల్: రైతులకు భరోసా కోసం రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. రైతులు బాగు పడితేనే మన రాష్ట్రం బాగు పడుద్దని సీఎం ఆలోచనగా వివరించారు.

ఆసియాలోనే అతిపెద్దైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో బుధవారం నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు రైతులకు, వ్యాపారాస్తులకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ అన్నీ రంగాల్లో మన జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఎన్నో కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ చుట్టూ ఉన్న 15 గ్రామాల పేద ప్రజలకీ, రైతులకు ఈ పోలీస్ స్టేషన్ వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.

హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం వేగంగా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో రానున్న రోజుల్లో ట్రాఫిక్, ఇతరత్ర సమస్యలు కూడా త్వరగా తీరెందుకు మా వైపు నుండి కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ గోపి మాట్లాడుతూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఈ భవనాన్ని నిర్మించారని 24 గంటలు పోలీస్ నిఘా అవసరమన్నారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ సిపి ఏవి రంగనాథ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి, డీసీపీ వెంకట లక్ష్మి, ఏసీపీ నరేష్, కార్పొరేటర్ తూర్పటి సులోచన సారయ్య, పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వర్తక సంఘం నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.