దొడ్ల డెయిరీ ఐపీఓకి సెబీ అనుమతి

దక్షిణ భారతదేశంలో డెయిరీ ఉత్పత్తుల్లో అగ్రగామి దొడ్ల డెయిరీ పబ్లిక్‌ ఇష్యూకి సెబీ ఆమోదముద్ర వేసింది. అలాగే ఎన్‌బీఎ్‌ఫసీ రంగంలోని ఆరోహణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇష్యూకి కూడా ఆమోదం తెలిపింది. రెండు కంపెనీలు తమ షేర్లను బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో లిస్టింగ్‌ చేయనున్నాయి. దొడ్ల డెయిరీ ఇష్యూ జారీ ద్వారా రూ.50 కోట్ల విలువ గల షేర్లు విడుదల చేయాలని నిర్ణయించింది. టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌, దొడ్ల సునీల్‌రెడ్డి, దొడ్ల దీపారెడ్డి, దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్‌ చేతిలో […]

దొడ్ల డెయిరీ ఐపీఓకి సెబీ అనుమతి

దక్షిణ భారతదేశంలో డెయిరీ ఉత్పత్తుల్లో అగ్రగామి దొడ్ల డెయిరీ పబ్లిక్‌ ఇష్యూకి సెబీ ఆమోదముద్ర వేసింది. అలాగే ఎన్‌బీఎ్‌ఫసీ రంగంలోని ఆరోహణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇష్యూకి కూడా ఆమోదం తెలిపింది. రెండు కంపెనీలు తమ షేర్లను బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో లిస్టింగ్‌ చేయనున్నాయి. దొడ్ల డెయిరీ ఇష్యూ జారీ ద్వారా రూ.50 కోట్ల విలువ గల షేర్లు విడుదల చేయాలని నిర్ణయించింది. టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌, దొడ్ల సునీల్‌రెడ్డి, దొడ్ల దీపారెడ్డి, దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్‌ చేతిలో ఉన్న 1,00,85,444 వాటాలను విక్రయించనున్నారు. ఈ నిధులను రుణభారం తగ్గించుకోవడంతో పాటు పెట్టుబడి అవసరాలకు వినియోగించుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆరోహణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 2,70,55,893 వాటాలు విక్రయించడం ద్వారా రూ.1800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.