శ‌శిక‌ళ అనుచ‌రుడి కారు ద‌హ‌నం

విధాత‌:రామనాథపురం జిల్లా అన్నాడీఎంకే ఎంజీఆర్‌ యువజన విభాగం కార్యదర్శిగా కొన్నాళ్లు పనిచేసిన విన్సెంట్‌ రాజా కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.అత‌ని తో శశికళ ఇటీవల మాట్లాగా ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవ్వ‌డంతో అన్నాడీఎంకే అధిష్టానం విన్సెంట్‌ రాజాను పార్టీ నుంచి బహిష్కరించి ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. కాగా విన్సెంట్‌ రాజా త‌న‌కు వున్న‌ పరమకుడి సమీపంలోని మేలక్కావనూరు గ్రామంలో కాంక్రీట్ మిక్సింగ్‌ కంపెనీ ప్రాంగణంలో కారును పార్క్‌ చేసి అక్కడి గదిలో విన్సెంట్‌ […]

శ‌శిక‌ళ అనుచ‌రుడి కారు ద‌హ‌నం

విధాత‌:రామనాథపురం జిల్లా అన్నాడీఎంకే ఎంజీఆర్‌ యువజన విభాగం కార్యదర్శిగా కొన్నాళ్లు పనిచేసిన విన్సెంట్‌ రాజా కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.అత‌ని తో శశికళ ఇటీవల మాట్లాగా ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవ్వ‌డంతో అన్నాడీఎంకే అధిష్టానం విన్సెంట్‌ రాజాను పార్టీ నుంచి బహిష్కరించి ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది.

కాగా విన్సెంట్‌ రాజా త‌న‌కు వున్న‌ పరమకుడి సమీపంలోని మేలక్కావనూరు గ్రామంలో కాంక్రీట్ మిక్సింగ్‌ కంపెనీ ప్రాంగణంలో కారును పార్క్‌ చేసి అక్కడి గదిలో విన్సెంట్‌ రాజా నిద్రపోతుండ‌గా సోమవారం తెల్లవారుజామున‌ 2.45 గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో విన్సెంట్ బయటకు వచ్చి చూడ‌గా గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కారుపై పెట్రోలు పోసి తగలబెడుతున్నారు వారు విన్సెంట్‌ను చూడగానే పారిపోయారు. విన్సెంట్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన శశికళ ఇటీవల మళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. అన్నాడీఎంకే నేతలతో టచ్‌లో ఉటూ అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

Readmore:సీఎం స్టాలిన్ కు ఆర్థిక సలహాదారుగా నోబెల్ గ్రహీత..!