కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి..
దేశంలో కరోనా ఉద్ధృతి ప్రజలను ఆందోళనలోకి నెట్టేస్తోంది. సోమవారం 16,58,700 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,23,144 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజాగా 2,771 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది. మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 16.25 శాతానికి పెరిగింది. మొత్తంగా 28,82,204 మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇంత ఉద్ధృతిలోనూ.. […]

దేశంలో కరోనా ఉద్ధృతి ప్రజలను ఆందోళనలోకి నెట్టేస్తోంది. సోమవారం 16,58,700 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,23,144 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజాగా 2,771 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది. మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 16.25 శాతానికి పెరిగింది. మొత్తంగా 28,82,204 మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇంత ఉద్ధృతిలోనూ.. రికవరీలు కాస్త ఊరటనిస్తున్నాయి. తాజాగా 2,51,827 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. మొత్తంగా కోటీ 45లక్షల మందికి పైగా వైరస్ నుంచి బయటపడగా..రికవరీ రేటు 82.62 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు, నిన్న 33,59,963 మందికి కేంద్రం టీకాలు అందజేసింది. మొత్తంగా 14,52,71,186 టీకా డోసులను పంపిణీ చేసింది.
మహారాష్ట్ర, దిల్లీలో తగ్గిన కొత్త కేసులు..
కరోనా విజృంభణతో కొట్టుమిట్టాడుతోన్న మహారాష్ట్ర, దిల్లీలో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మహారాష్ట్రలో 48,700 మందికి కరోనా సోకగా..524 మరణాలు సంభవించాయి. క్రియాశీల కేసులు కూడా 6,76,647కి తగ్గడం సానుకూల పరిణామం. అంతకు ముందు రోజు ఆ సంఖ్య ఏడులక్షలకు పైనే ఉంది. ఇక, దిల్లీలో 20,201 మంది వైరస్ బారినపడగా..380 మరణాలు సంభవించాయి. కేరళ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు విధిస్తోన్న ఆంక్షలు కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేస్తున్నట్లు కనిపిస్తున్నాయి..