స్టాలిన్ మ‌న‌సు దోచిన‌ బుడ్డోడు

సైకిల్ కొనుక్కోవాల‌న్న‌ది ఓ బుడ్డోడి చిరకాల కోరిక‌. ఇందుకోసం రెండేళ్లుగా డ‌బ్బులు దాచుకుంటున్నాడు. క‌రోనా రోగులు ప‌డుతున్న బాధ‌ల‌ను చూసిన ఆ చిన్నారి త‌న కోరిక‌ను చంపుకున్నాడు. కోవిడ్ బాధితుల‌కు అండ‌గా ఉండాల‌ని భావించాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా తాను దాచుకున్న డ‌బ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ఏకంగా సీఎం స్టాలిన్‌కే ఓ లేఖ రాశాడు మధురైకు చెందిన హరీశ్ వర్మన్ అనే ఒక బాలుడు. మధురైకు చెందిన ఓ ఎలక్ట్రిషియన్ కుమారుడు హరీశ్ వర్మన్. త‌ల్లిదండ్రులు […]

స్టాలిన్ మ‌న‌సు దోచిన‌ బుడ్డోడు

సైకిల్ కొనుక్కోవాల‌న్న‌ది ఓ బుడ్డోడి చిరకాల కోరిక‌. ఇందుకోసం రెండేళ్లుగా డ‌బ్బులు దాచుకుంటున్నాడు. క‌రోనా రోగులు ప‌డుతున్న బాధ‌ల‌ను చూసిన ఆ చిన్నారి త‌న కోరిక‌ను చంపుకున్నాడు. కోవిడ్ బాధితుల‌కు అండ‌గా ఉండాల‌ని భావించాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా తాను దాచుకున్న డ‌బ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ఏకంగా సీఎం స్టాలిన్‌కే ఓ లేఖ రాశాడు మధురైకు చెందిన హరీశ్ వర్మన్ అనే ఒక బాలుడు.

మధురైకు చెందిన ఓ ఎలక్ట్రిషియన్ కుమారుడు హరీశ్ వర్మన్. త‌ల్లిదండ్రులు ఇచ్చిన డ‌బ్బును సైకిల్ కోసం దాచుకున్నాడు. కరోనా విషాద వార్తలు వినీ, చూసి, ఆ పిల్లవాడి మనస్సు చలించిపోయింది. తాను దాచుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపాడు.

ఈ సొమ్మును ఎవరైనా ఓ కోవిడ్ పేషెంట్‌ చికిత్సకు అందివ్వాలని ఆ బాలుడు తన లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ చూసి స్టాలిన్ కదిలిపోయాడు. ఆ పిల్లవాడికి ఒక సైకిల్‌ను బహుమానంగా పంపించాడు. ఈ సైకిల్‌ను స్థానిక ఎమ్మెల్యే,ఇతర నాయకులు ఆ బాలుడికి అందించారు.

ఆ బాలుడు సైకిల్‌ను తడుముకుంటూ తెగ సంబరపడిపోయాడు. అంతేకాదు, ఆ బాలుడికి స్టాలిన్ ఫోన్ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.