తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం
విధాత(చెన్నై): తమిళనాడు 14వ సీఎంగా ముత్తువేళ్ కరుణానిధి స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. స్టాలిన్ అనంతరం 34 మంది మంత్రులు సైతం ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు […]

విధాత(చెన్నై): తమిళనాడు 14వ సీఎంగా ముత్తువేళ్ కరుణానిధి స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. స్టాలిన్ అనంతరం 34 మంది మంత్రులు సైతం ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు.
మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కేబినెట్ సమావేశమై.. కరోనా నివారణ చర్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే, సినీ నటుడు ఉదయనిధి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా.. స్టాలిన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భార్య ఉద్వేగానికి లోనయ్యారు.
అభినందనలు:
తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ టీఎస్ విజయచందర్ అభినందనలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహాన్న తొలిసారిగా తమిళనాడులో ఆవిష్కరించినది వీరి తండ్రిగారైన స్వర్గీయ శ్రీ కరుణానిధి అని ప్రశంసించారు.
ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇచ్చి ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజల మన్ననలను పొందిన శ్రీ స్టాలిన్ ప్రజలకు మంచి సుపరిపాలన అందించి వారి మన్ననలు పొందాలని ఆశిస్తూ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనవడుగా మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా టీఎస్ విజయచందర్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.