కాబుల్​ లోకి తాలిబన్లు- అఫ్గాన్​ పూర్తిగా వారి వశం!

విధాత:అఫ్గానిస్థాన్​ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అతికొద్ది రోజుల్లోనే కీలక నగరాలను హస్తగతం చేసుకున్న తాలిబన్లు… ఆదివారం రాజధానిలోకీ ప్రవేశించినట్టు సమాచారం. కాబుల్​ శివార్లలోని కలాకన్, ఖారాబాఘ్​, పఘ్​మన్​ జిల్లాలు ఇప్పటికే ముష్కరుల వశమైనట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం అధికారులు ముగ్గురు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. కాబుల్​లోకి ప్రవేశించామని తాలిబన్లు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే… అనేక ప్రభుత్వ కార్యాలయాలు తమ ఉద్యోగులను అర్థంతరంగా ఇళ్లకు పంపేశాయి. కాబుల్​లోని కీలక ప్రాంతాల్లో సైనిక హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ […]

కాబుల్​ లోకి తాలిబన్లు- అఫ్గాన్​ పూర్తిగా వారి వశం!

విధాత:అఫ్గానిస్థాన్​ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అతికొద్ది రోజుల్లోనే కీలక నగరాలను హస్తగతం చేసుకున్న తాలిబన్లు… ఆదివారం రాజధానిలోకీ ప్రవేశించినట్టు సమాచారం. కాబుల్​ శివార్లలోని కలాకన్, ఖారాబాఘ్​, పఘ్​మన్​ జిల్లాలు ఇప్పటికే ముష్కరుల వశమైనట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం అధికారులు ముగ్గురు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. కాబుల్​లోకి ప్రవేశించామని తాలిబన్లు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే… అనేక ప్రభుత్వ కార్యాలయాలు తమ ఉద్యోగులను అర్థంతరంగా ఇళ్లకు పంపేశాయి. కాబుల్​లోని కీలక ప్రాంతాల్లో సైనిక హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ కనిపించాయి.