నా ప్రైవేట్‌ భాగాలపై కొట్టేవాడు: లక్స్‌ పాప ఆశా షైనీ

విధాత‌, సినిమా: ఆశా షైనీ అలియాస్ ఫ్లోరాషైనీ ఓ మోడల్. దక్షిణాది సినిమాలలో ఎక్కువగా నటించింది ముఖ్యంగా తెలుగులో చాలా సినిమాలు చేసింది. 1999లో ప్రేమ కోసం అనే సినిమాతో కెరీర్‌ను ప్రారంభించి విజయ్ కాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతిబాబు, రాజశేఖర్ వంటి హీరోల సరసన సుమారు 70కి పైగా సినిమాల్లో నటించింది. నరసింహ నాయుడు చిత్రంలో ఆశాషైనీపై చిత్రీకరించిన ల‌క్స్ పాపా.. ల‌క్స్ పాపా లంచ్ కొస్తావా లడ్డు తినిపిస్తావా అనే పాట […]

నా ప్రైవేట్‌ భాగాలపై కొట్టేవాడు: లక్స్‌ పాప ఆశా షైనీ

విధాత‌, సినిమా: ఆశా షైనీ అలియాస్ ఫ్లోరాషైనీ ఓ మోడల్. దక్షిణాది సినిమాలలో ఎక్కువగా నటించింది ముఖ్యంగా తెలుగులో చాలా సినిమాలు చేసింది. 1999లో ప్రేమ కోసం అనే సినిమాతో కెరీర్‌ను ప్రారంభించి విజయ్ కాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతిబాబు, రాజశేఖర్ వంటి హీరోల సరసన సుమారు 70కి పైగా సినిమాల్లో నటించింది.

నరసింహ నాయుడు చిత్రంలో ఆశాషైనీపై చిత్రీకరించిన ల‌క్స్ పాపా.. ల‌క్స్ పాపా లంచ్ కొస్తావా లడ్డు తినిపిస్తావా అనే పాట అప్పట్లో మన తెలుగునాట ఓ ఊపు ఊపింది. అదే వరుసలో మనసున్న మహారాజు, సర్దుకుపోదాం రండి, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావు, అక్క బావెక్క‌డ వంటి చిత్రాల‌లో సహయ, సెకండ్‌ హీరోయున్‌ పాత్రలు చేసింది.

మార్చి 2008లో ఆమెను చెన్నైలో నకిలీ వీసా కలిగి ఉన్నదని నేరం మీద అరెస్టు చేయడంతో ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ బహిష్కరించింది. ఆమె తాను నిర్దోషిని ప్రకటించగా, రెండు వారాల తర్వాత ఆమెపై నిషేదాన్ని ఎత్తివేశారు. ఆ తర్వాత ఓ నిర్మాతతో ఎఫైర్ బెడిసి కొట్టి కొంతకాలం తెరపై కనిపించకుండా పోయింది. 2018 లో ప్రముఖ నిర్మాతతో తనకు రిలేషన్‌షిప్‌ ఉందని వెల్లడించింది. అప్పట్లో ఆ వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.

తాజాగా మరోసారి ఆమె గతాన్ని గుర్తు చేసుకుంటూ.. తన ఇంస్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఓ ప్రముఖ నిర్మాతతో నేను నాలుగు నెలలు రిలేషన్‌లో ఉన్నా కానీ ఆ వెంటనే పరిస్థితులు మారాయని పేర్కొంది. శారీరక వేధించేవాడని, దుర్భాషలాడేవాడని, నా ముఖాన్ని పట్టుకొని ప్రైవేట్ భాగాలపై కొట్టేవాడని వాపోయింది. అతను నా ఫోన్ తీసుకొని నన్ను పని మానేయమని బలవంతం చేసేవాడని, 14 నెలల పాటు ఎవరితో మాట్లాడనివ్వలేదని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Flora Saini (@florasaini)

ఓ సాయంత్రం నన్ను నా కడుపుపై గట్టిగా కొట్టడంతో, అక్కడి నుంచి నిస్స‌హాయంగా పారిపోయానని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ నిర్మాత వల్ల నేను పొందిన శారీరక మానసిక బాధ నుంచి బయట పడటానికి నెలలు పట్టిందని పేర్కొంది.

ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నానని, మళ్ళీ ఇప్పుడు నేను ప్రేమలో పడ్డానని, ఎంతటి చీకటిలోనైనా నేను వెలుతురును వెతుక్కుంటానని తెలిపింది ఆశా సైని. అంతేకాకుండా కొత్త బంధంలోకి అడుగు పెట్టబోతున్నానని ఇందుకు అందరి ఆశీస్సులు త‌న‌కు కావాలని ఆశా షైని కోరింది.

అయితే అశాషైనీ ప్రస్తుతం సినిమాలలో అంతగా కనిపించకున్నా ఆల్ట్‌ బాలాజీ వారి ఆడల్ట్‌ సీరిస్‌లలో నటిస్తూ కుర్రకారుక నిద్రపట్టకుండా చేస్తున్నది.