మృత దేహం ద్వారా కరోనా వ్యాప్తి జరగదు
బాధ్యతారాహిత్యంగా ఉన్న వ్యక్తుల ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తి. స్విచ్ ఆఫ్ చేస్తే కరెంటు ఆగిపోయినట్లు, ప్రాణం పోయిన తర్వాత వైరస్ ఉత్పత్తి ఆగిపోతుంది. మృత దేహాన్ని డైరెక్టుగా తాకడం చేయవద్దు మరణించిన బంధుమిత్రులు అనాథ శవాలుగా వారి ఆత్మ ఘోషించవద్దు. గౌరవ ప్రదమైన అంత్యక్రియలు జరపండి, వారి కుటుంబాలకు అండగా ఉండండి. కరోనా వైరస్ కేవలం బతికి ఉన్న మనిషిలోని సజీవంగా ఉంటుంది. చనిపోయిన కొద్ది గంటలకు నిర్వీర్యం అవుతుంది. మృత దేహాన్ని హైపోక్లోరిన్, ఇతర […]

బాధ్యతారాహిత్యంగా ఉన్న వ్యక్తుల ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తి. స్విచ్ ఆఫ్ చేస్తే కరెంటు ఆగిపోయినట్లు, ప్రాణం పోయిన తర్వాత వైరస్ ఉత్పత్తి ఆగిపోతుంది. మృత దేహాన్ని డైరెక్టుగా తాకడం చేయవద్దు
మరణించిన బంధుమిత్రులు అనాథ శవాలుగా వారి ఆత్మ ఘోషించవద్దు. గౌరవ ప్రదమైన అంత్యక్రియలు జరపండి, వారి కుటుంబాలకు అండగా ఉండండి.
కరోనా వైరస్ కేవలం బతికి ఉన్న మనిషిలోని సజీవంగా ఉంటుంది. చనిపోయిన కొద్ది గంటలకు నిర్వీర్యం అవుతుంది. మృత దేహాన్ని హైపోక్లోరిన్, ఇతర శానిటైజర్ ద్రవంలో తడిపిన వస్త్రం లేదా బాడీ బాగ్ వాడండి. ఆ నలుగురు మాస్క్ , గ్లౌస్ , పీపీ కిట్ వేసుకుంటే సరిపోతుంది.
కుటుంబ సభ్యులు మీద పడి ఏడవొద్దు. ఇంటిలోపల గుమి కుడవద్దు. అందరూ ఆరుబయట ఉంటే మంచిది. ముఖ్యంగా ఇరుకు గదులు ఉన్నవాళ్లు దహన సంస్కారం తొందరగా చెయ్యండి.
దశ దిన కర్మ కుటుంబానికి పరిమితం చేయండి. ఆ విధానాన్ని ధనిక విద్యావంతులు పాటిస్తున్నారు, కానీ పేద మధ్యతరగతి పూర్తిగా అవగాహనా పెంచుకోలేదు. మన కల్చర్‌లో బంధుమిత్రులు పిలిస్తే పోకుండా ఉంటే అవమానంగా భావిస్తారు. ఆ భావనకు ఇది సమయం కాదు.
శుభా కార్యాలకు పోయినా పోకున్నా, మరణం సంభవించిన మీ బంధు మిత్రుల కుటుంబాలకు ఫోన్ ద్వారా లేదా కోవిద్ నిబంధనలు పాటించి పరామర్శించండి. ఆర్థికంగా కష్టాలలో ఉన్న మీ బంధు మిత్రులకు తక్కువ అయినా కొంత ఆర్థిక సహాయం చేయగలిగితే అదే పదివేలు..