భారత్‌లో భారీగా తయారకానున్నా నోవావాక్స్ టీకా
విధాత:భారత్‌లో త్వరలోనే నోవావాక్స్ టీకా భారీగా తయారవుతుందని భావిస్తున్నట్టు నీతిఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ తెలిపారు.అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కలిసి పనిచేస్తోందని,భారత్‌లో టీకా ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరాయన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఆశావహంగానే ఉన్నట్టు పాల్ వివరించారు. మరోవైపు, మూడో దశలో తమ టీకా సామర్థ్యం 90శాతంగా ఉన్నట్టు నోవావాక్స్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.