గోశాలకు రెండు ఆవులు, దూడల విరాళంగా ఇచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చైర్మన్

విధాత‌: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక చైర్మన్ శివకుమార్ సుందరన్ కాంక్రీజ్ జాతికి చెందిన రెండు ఆవులు, రెండు దూడలను శుక్రవారం దానంగా సమర్పించారు.ఆ పత్రిక ప్రతినిధి సందీప్ టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆవులు, దూడలను గోశాలకు అందించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి రెడ్డి ఆవులకు ప్రత్యేకంగా పూజలు చేసి వాటిని అందుకున్నారు.శ్రీవారి నవనీత సేవకు అవసరమయ్యే వెన్న తీయడానికి ఎన్ని లీటర్ల పాలు […]

గోశాలకు రెండు ఆవులు, దూడల విరాళంగా ఇచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చైర్మన్

విధాత‌: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక చైర్మన్ శివకుమార్ సుందరన్ కాంక్రీజ్ జాతికి చెందిన రెండు ఆవులు, రెండు దూడలను శుక్రవారం దానంగా సమర్పించారు.
ఆ పత్రిక ప్రతినిధి సందీప్ టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆవులు, దూడలను గోశాలకు అందించారు.

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి రెడ్డి ఆవులకు ప్రత్యేకంగా పూజలు చేసి వాటిని అందుకున్నారు.శ్రీవారి నవనీత సేవకు అవసరమయ్యే వెన్న తీయడానికి ఎన్ని లీటర్ల పాలు అవసరమవుతాయి, ఎన్ని పాలిచ్చే ఆవులు ఉండాల్సిన అవసరం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో తిరుమలలో శ్రీవారికి దేశీయ ఆవుల పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడానికి తిరుమల లోని గోశాలను విస్తరించడం జరుగుతుందన్నారు. ఇక్కడ సుమారు 150 పాలిచ్చే ఆవులను ఉంచడం కోసం రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ 60 దేశీయ జాతి ఆవులు ఉన్నాయని, మరో 70 నుంచి 80 ఆవులను దానంగా ఇచ్చేందుకు అనేకమంది దాతలు ముందుకొచ్చారని చైర్మన్ చెప్పారు.