హంపి హనుమద్ ట్రస్టు లేఖపై టీటీడీ అభ్యంతరం

విధాత‌(తిరుమల): హంపి శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యుత్తరం పంపింది. హనుమంతుడి జన్మస్థలంగా అంజనాద్రిని తితిదే ఇటీవల ప్రకటించింది. తితిదే ప్రకటనను శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తప్పుబట్టింది. హంపికి చెందిన ట్రస్టు లేఖలోని వ్యాఖ్యలపై తితిదే అభ్యంతరం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలతో హనుమాన్‌ జన్మస్థలం ప్రకటించామని తితిదే పేర్కొంది. ప్రత్యుత్తరంతో కమిటీ సేకరించిన వివరాలను తితిదే జత చేసింది. ఈ నెల 20 లోగా హనుమాన్‌ జన్మస్థలం […]

హంపి హనుమద్ ట్రస్టు లేఖపై టీటీడీ అభ్యంతరం

విధాత‌(తిరుమల): హంపి శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యుత్తరం పంపింది. హనుమంతుడి జన్మస్థలంగా అంజనాద్రిని తితిదే ఇటీవల ప్రకటించింది. తితిదే ప్రకటనను శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తప్పుబట్టింది. హంపికి చెందిన ట్రస్టు లేఖలోని వ్యాఖ్యలపై తితిదే అభ్యంతరం వ్యక్తం చేసింది.

సరైన ఆధారాలతో హనుమాన్‌ జన్మస్థలం ప్రకటించామని తితిదే పేర్కొంది. ప్రత్యుత్తరంతో కమిటీ సేకరించిన వివరాలను తితిదే జత చేసింది. ఈ నెల 20 లోగా హనుమాన్‌ జన్మస్థలం నిర్థరించే ఆధారాలను పంపాలని ట్రస్టును కోరింది. కరోనా వ్యాప్తి తగ్గాక చర్చకు ఆహ్వానిస్తామని లేఖలో టీటీడీ పేర్కొంది.