ఆగని బాదుడు, మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు

ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. విధాత:తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.76, డీజిల్‌ రూ.88.30కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ రూ.103.89కు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109కి చేరువైంది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.108.94, డీజిల్‌ రూ.101.48 పలుకుతోంది. ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 30 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.44, డీజిల్‌పై […]

ఆగని బాదుడు, మరోసారి పెట్రోల్ డీజిల్  ధరలు పెంపు

ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

విధాత:తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.76, డీజిల్‌ రూ.88.30కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ రూ.103.89కు చేరింది.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109కి చేరువైంది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.108.94, డీజిల్‌ రూ.101.48 పలుకుతోంది.

ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 30 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.44, డీజిల్‌పై రూ.7.52 పెరిగింది.

ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు డాలర్‌కు 75 డాలర్ల మార్క్‌ను దాటింది.

గత రెండేళ్లలో బ్రెంట్‌ ముడి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. యూఎస్‌ క్రూడ్‌ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.38 డాలర్లు పెరిగి.. 75.19 డాలర్లకు చెరింది.

యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.18 డాలర్లు పెరిగి.. 73.26 వద్ద ముగిసింది.

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌ ధరలు

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.97.76.. డీజిల్‌ రూ.88.30

ముంబైలో పెట్రోల్‌ రూ.103.89.. డీజిల్‌ రూ.95.79

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.101.60.. డీజిల్‌ రూ.96.25

చెన్నైలో పెట్రోల్‌ రూ.98.88.. డీజిల్‌ రూ.92.89

కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.97.63, డీజిల్‌ రూ.91.15

విజయవాడలో పెట్రోల్‌ రూ.103.53, డీజిల్‌ రూ.97.61

బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.03, డీజిల్‌ రూ.93.61

పాట్నాలో పెట్రోల్‌ రూ.99.80.. డీజిల్‌ రూ.93.63

చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.94.02, డీజిల్‌ రూ.87.94

లక్నోలో పెట్రోల్‌ రూ.94.95, డీజిల్‌ రూ.88.71