ఉత్త‌రాఖండ్‌లో 18 ఏళ్లు నిండిన‌వారికి టీకా

విధాత‌(డెహ్రాడూన్): ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇచ్చే కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఈ ప్ర‌చారాన్ని ఆ రాష్ట్ర సీఎం తీరత్ సింగ్ రావత్ సోమ‌వారం ప్రారంభించారు. రాజధాని న‌గ‌రం డెహ్రాడూన్‌లోని హరిద్వార్ బైపాస్ రోడ్‌లో ఉన్న‌ రాధా స్వామి సత్సంగ్ న్యాస్ వద్ద 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని చేప‌ట్టారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మూడో రౌండ్ టీకాల ప్రచారం ప్రారంభించామ‌ని, దీని కింద రాష్ట్రంలోని […]

ఉత్త‌రాఖండ్‌లో 18 ఏళ్లు నిండిన‌వారికి టీకా

విధాత‌(డెహ్రాడూన్): ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇచ్చే కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఈ ప్ర‌చారాన్ని ఆ రాష్ట్ర సీఎం తీరత్ సింగ్ రావత్ సోమ‌వారం ప్రారంభించారు. రాజధాని న‌గ‌రం డెహ్రాడూన్‌లోని హరిద్వార్ బైపాస్ రోడ్‌లో ఉన్న‌ రాధా స్వామి సత్సంగ్ న్యాస్ వద్ద 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని చేప‌ట్టారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మూడో రౌండ్ టీకాల ప్రచారం ప్రారంభించామ‌ని, దీని కింద రాష్ట్రంలోని 50 లక్షల మంది యువతకు కొవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తెలిపారు.

18 నుంచి 44 సంవత్సరాల మధ్య ప్రజలకు మొదటిసారి ఉచిత టీకాలు వేసినట్లు ప్రకటించిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. దీని కోసం రూ.400 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించ‌నున్న‌ది. ప్రతి పంచాయతీ స్థాయికి కూడా కొవిడ్ టీకా ప్రచారాన్ని తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న‌దని ముఖ్యమంత్రి తీర‌త్ సింగ్ రావ‌త్ అన్నారు.

వృద్ధులు, దివ్యంగుల‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీకాలు వేయడానికి అన్ని బూత్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను సీఎం ఆదేశించారు. ఇలాఉండ‌గా, టీకాలు వేసుకున్న త‌ర్వాత కూడా కొవిడ్ ప్రొటోకాల్ పాటించాల‌ని, ముక్కుకు మాస్క్ ధ‌రంచ‌డం, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవ‌డం వంటివి త‌ప్ప‌నిస‌రిగా అనుస‌రించాల‌ని ముఖ్య‌మంత్రి తీరత్ సింగ్ రావత్ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేశారు.