పీఏసీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

విధాత,న్యూఢిల్లీ, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీకి చెందిన వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ విషయాన్ని రాజ్య సభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌ వర్మ ఒక బులెటెన్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేష్‌ యాదవ్‌,రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి.ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు నామినేషన్లు ఆహ్వానించగా విజయసాయి రెడ్డితోపాటు బీజేపీకి చెందిన […]

పీఏసీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

విధాత,న్యూఢిల్లీ, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీకి చెందిన వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ విషయాన్ని రాజ్య సభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌ వర్మ ఒక బులెటెన్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేష్‌ యాదవ్‌,రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి.ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు నామినేషన్లు ఆహ్వానించగా విజయసాయి రెడ్డితోపాటు బీజేపీకి చెందిన డాక్టర్‌ సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు.ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో వీరిద్దరూ పీఏసీకి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు.