వైర‌లవుతున్న వీర్ దాస్ స్టాండ‌ప్ కామెడీ.. ఇది సాఫ్ట్ టెర్ర‌రిజ‌మే : కంగ‌నా

విధాత‌: ప్ర‌ముఖ యూట్యూబ్ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ వీర్ దాస్ తాజాగా చేసిన "ఐ క‌మ్ ఫ్ర‌మ్ టూ ఇండియాస్" షో చ‌ర్చ‌ల‌కు దారి తీస్తుంది. ఇంత‌కు ముందు సామాజిక స‌మ‌స్య‌ల‌పై వీడియోలు చేసిన‌ వీర్ దాస్ ఈ సారీ దేశం పై సెటైర్లు వేస్తూ వీడియో అప్లోడ్ చేశాడు. జాన్ ఎఫ్ కెన్నడీ "డీసీ ఫ్ర‌మ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్" కార్య‌క్ర‌మంలో తాను మాట్లాడిన ఐ క‌మ్ ఫ్ర‌మ్ టు ఇండియాస్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. త‌న […]

వైర‌లవుతున్న వీర్ దాస్ స్టాండ‌ప్ కామెడీ.. ఇది సాఫ్ట్ టెర్ర‌రిజ‌మే : కంగ‌నా

విధాత‌: ప్ర‌ముఖ యూట్యూబ్ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ వీర్ దాస్ తాజాగా చేసిన “ఐ క‌మ్ ఫ్ర‌మ్ టూ ఇండియాస్” షో చ‌ర్చ‌ల‌కు దారి తీస్తుంది. ఇంత‌కు ముందు సామాజిక స‌మ‌స్య‌ల‌పై వీడియోలు చేసిన‌ వీర్ దాస్ ఈ సారీ దేశం పై సెటైర్లు వేస్తూ వీడియో అప్లోడ్ చేశాడు.

జాన్ ఎఫ్ కెన్నడీ “డీసీ ఫ్ర‌మ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్” కార్య‌క్ర‌మంలో తాను మాట్లాడిన ఐ క‌మ్ ఫ్ర‌మ్ టు ఇండియాస్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. త‌న ఒపీనియ‌న్ ను ఎప్ప‌టిలాగే కొందరు స‌పోర్ట్ చేస్తే మ‌రి కొంద‌రు దేశాన్ని కించ‌ప‌రిచాడ‌ని, దేశ ద్రోహం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా కంగ‌నా ర‌నౌత్ మాత్రం ఇది సాఫ్ట్ టెర్ర‌రిజమ‌ని ఆరోపించింది. ఇంత దారుణమైన విమ‌ర్శ‌లు ఎదుర్కొంటేనే భారీ స‌పోర్ట్ పొందుతున్న వీర్ దాస్ ఈ వీడియో లో గ్యాంగ్ రేప్స్, ఫార్మ‌ర్ ప్రొటెస్ట్ ,దేశ రాజ‌కీయాల గురించి మాట్లాడాడు.