Minister Seethakka | రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి సీతక్క

గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నందున ములుగు జిల్లా లో పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.

Minister Seethakka | రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి సీతక్క

తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

విధాత, వరంగల్ ప్రతినిధి: గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నందున ములుగు జిల్లా లో పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రైతులు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందని, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.