వెడ్డింగ్ కార్డ్ ఫొటో షేర్ చేసిన నవదీప్..ఓపెన్ చేసి చూసి అందరు షాక్

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో నవదీప్ కూడా ఒకరు. జై సినిమాతో హీరోగా పరిచయం అయిన నవదీప్ ఇటు సినిమాలలో ప్రధాన పాత్ర పోషిస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్‌లోను కనిపించి సందడి చేస్తున్నాడు. అయితే ఒకప్పటి మాదిరిగా నవదీప్ సినిమాలు చేయడం లేదు. ఏదో అడపాదడపా అలా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. పలు షోస్‌లో అప్పుడప్పుడు మెరుస్తున్నాడు. అయితే ఇతగాడి వయస్సు పెరగిపోతుండగా, ఇప్పటికీ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. తన పెళ్లిపై పలు రూమర్స్ వస్తుండగా, కొన్నిసార్లు సైలెంట్‌గా ఉంటాడు. కొన్నిసార్లు అదిరిపోయే పంచ్‌లు ఇస్తుంటాడు. అయితే నవదీప్ రీసెంట్‌గా తనఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ అందరు తనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారని అన్నాడు.
అదేంటో నేను చెబుతానంటూ నవదీప్ ఏకంగా పెళ్లి శుభలేఖ షేర్ చేసి పెద్ద షాకిచ్చాడు. ఇక ముహుర్తం ఎప్పుడు? పెళ్లి కూతురు ఎవరు ? అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి శుభలేఖ గురించి ప్రత్యేకంగా ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయగా, అందులో పెళ్లి శుభలేఖ కనిపించింది. అయితే శుభలేఖలో పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు వివరాలు కాకుండా.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లవ్ మౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా నవదీప్ వేసిన స్కెచా ఇది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నవదీప్, పంఖురి గిద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ మౌళి.
ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ఆ శుభలేఖలో తెలియజేశాడు. పెళ్లి కొడుకు పేరు దగ్గర నవదీప్ పేరు.. పెళ్లి కూతురు పేరు స్థానంలో పంఖురి గిద్వానీ పేరు.. ముహుర్తం ప్లేస్ లో సినిమా రిలీజ్ డేట్ ను చూపిస్తూ వీడియో రిలీజ్ చేయడం విశేషం. అచ్చం పెళ్లి శుభలేఖ మాదిరిగా డిజైన్ చేసి తన సినిమాపై అందరి దృష్టి పడేలా చేశాడు నవదీప్. ఏది ఏమైన ఇలా వినూత్నంగా సినిమా ప్రమోషన్ చేయడం పట్ల ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లవ్ మౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ సినిమాలో నవదీప్ సిక్స్ ప్యాక్స్ బాడీతోపాటు లాంగ్ హోయిర్ తో గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తాడని సమాచారం. అవనీంద్ర దర్శకత్వంలో మూవీ తెరకెక్కింది.