WhatsApp Feature | మరో ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్.. చాట్‌లను ఎలా పిన్ చేయాలో తెలుసా..?

WhatsApp Feature | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్‌లో ముందున్నది. ఈ క్రమంలో మెటా కంపెనీ యూజర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నది. తాజాగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని సహాయంతో ఒకేసారి ఏకంగా మూడ్‌చాట్ మెసేజ్‌లను పిన్ చేసేందుకు అవకాశం ఉన్నది. కొన్ని గ్రూప్‌చాట్, ప్రైవేట్ చాట్ కోసమైనా యూజర్లు వాడుకునేందుకు వీలుంటుంది. మల్టీపుల్ మెసెజెస్ ఉన్న గ్రూపు ఉంటే.. వాటిని సైతం పిన్ చేసుకోవచ్చు. పిన్ చేయడంతో వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మొదట ఆ మెసేజ్‌స్ కనిపిస్తుంటాయి.
దీనికి సంబంధించి మెటా సీఈవో జుకర్ బర్గ్ ఇటీవలే తన వాట్సాప్ ఛానెల్‌లో స్క్రీన్ షాట్‌ని షేర్ చేశారు. ఒక మెసెజ్‌ను చాలా కాలం పాటు పిన్ చేసేందుకు వీలుంటుంది. సాధారణంగా ఏదైనా మెసెజ్ వస్తే.. చాట్, గ్రూపు మెసెజ్ వస్తే దాన్ని చూసేందుకు కిందికి స్క్రోల్ చేయాల్సి వస్తుంది. పిన్ ఆప్షన్ కారణంగా ఆ అవసరం ఉండదు. పిన్ చేసిన చాట్ మెసెజెస్ టాప్‌లో కనిపిస్తాయి. అయితే, తప్పనిసరిగా మూడింటిని పిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండు గరిష్ఠంగా మూడు మాత్రమే పిన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మెసెజెస్‌కు అదనంగా ఫొటోలు, పోల్స్ రెండింటినీ పిన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పిన్ చేసిన వాటిని 24గంటలు, వారం రోజులు, నెల వరకు టైమ్ పీరియడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
పిన్ ఎలా చేయాలో తెలుసా..?
మొదట చాట్‌ను పిన్ చేసేందుకు చాట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీరు పిన్ చేయాలనుకుంటున్న మెసెజ్‌పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ‘More Options’పై క్లిక్ చేసిన తర్వాత ‘Pin’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. చాట్ ఎగువన సందేశాలు కనిపిస్తుంటాయి. మొబైల్ వర్షన్ లేదంటే డెస్క్‌టాప్ వర్షన్‌కు దాదాపు ఒకే విధంగా ఉంటుంది. మొదట మెసెజ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అయితే, గ్రూప్ అడ్మిన్లు ఇతర సభ్యుల మెసెజ్‌లను పిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చని వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్ మొబైల్స్, ఐఓఎస్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లు సైతం పిన్ చేసేందుకు అవకాశం ఇచ్చింది.