Pooja Hegde: దేశాన్నిషేక్ చేస్తున్న పూజా హెగ్డే.. సోష‌ల్ మీడియా అంతా ర‌చ్చ‌ర‌చ్చ‌

  • By: sr    actress    Jan 31, 2025 9:06 PM IST
Pooja Hegde: దేశాన్నిషేక్ చేస్తున్న పూజా హెగ్డే.. సోష‌ల్ మీడియా అంతా ర‌చ్చ‌ర‌చ్చ‌

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) కాస్త విరామం అనంత‌రం క‌థానాయిక‌గా న‌టించిన బాలీవుడ్‌ చిత్రం దేవ (Deva). షాహిద్ క‌పూర్ (Shahid Kapoor) హీరోగా మ‌ల‌యాళ చిత్రం ముంబై పోలీస్‌కు రీమేక్‌గా వ‌చ్చిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ను తెచ్చుకుంది. తెలుగులో చివ‌ర‌గా ఆచార్య సినిమాలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత F3 సినిమాలో ఓ ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. ఆపై మ‌రే తెలుగు చిత్రం చేయ‌ని ఈ సుంద‌రి ఇత‌ర భాషా చిత్రాల్లో అవ‌కాశాలు బాగానే ద‌క్కించుకుంటోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్‌, సూర్య వంటి స్టార్ హీరోల చిత్రాలు చేస్తుండ‌గా బాలీవుడ్‌లోనూ మ‌రో రెండు సినిమాల్లో న‌టిస్తోంది.

ఇద‌లాఉండ‌గా.. తాజాగా దేవ (Deva) సినిమా విడుద‌ల అనంత‌రం పూజా హెగ్డే (Pooja Hegde)పేరు ఒక్కసారిగా దేశ‌వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఉద‌యం నుంచి అమ్మ‌డి పేరు టాప్‌లో ట్రెండ్ అవుతూ ట్వీట్లు, రీట్వీట్ల సునామీ జ‌రుగుతోంది. అందుకు కార‌ణం మూవీలో ఘాటైన ముద్దు స‌న్నివేశంలో న‌టించ‌డ‌మే. సినిమాల్లోకి పుష్క‌ర కాలం పూర్తి చేసుకున్న పూజా హెగ్డే ఏనాడు ఏ సినిమాలో శృతి మించి అందాల ప్ర‌ద‌ర్శ‌ణ చేసింది లేదు. హృతిక్ రోష‌న్ మొహంజ‌దారో, అఖిల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాల్లో ముద్దు స‌న్నివేశాల్లో న‌టించింది కానీ అవి అంత‌గా ప్రాచుర్యంలోకి రాలేదు.

అయితే.. తాజాగా విడుద‌లైన దేవ సినిమాలో షాహిద్ క‌పూర్ (Shahid Kapoor) తో నిమిషానికి పైగా సుధీర్ఘంగా సాగిన స‌న్నివేశంలో పూజా హెగ్డే (Pooja Hegde) ఘాటైన అద‌ర చుంబ‌నం చేసి ప్రేక్ష‌కుల‌ను అశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ సీన్ చూసిన వారంతా పూజా లీన‌మై న‌టించింద‌ని, గ‌తంలో త‌న‌ను ఎప్పుడు ఇలా చూడ‌లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు సినిమాలోని ఆ చుంబ‌నం వీడియోను ప్ర‌తి ఒక్క‌రు సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు, రీ పోస్టులు చేస్తున్నారు. మీరూ వాటిని చూసేయండి మ‌రి.