మూడో దశ ముందస్తు చర్యలపై ఆళ్లనాని,జగన్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమీక్ష
విధాత: కరోనా మూడో దశ నేపథ్యంలో ముందస్తు చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఇవ్వాలి. పాఠశాలల్లో కొవిడ్ టెస్టింగ్‌కు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదు’’ అని […]

విధాత: కరోనా మూడో దశ నేపథ్యంలో ముందస్తు చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఇవ్వాలి. పాఠశాలల్లో కొవిడ్ టెస్టింగ్‌కు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదు’’ అని అధికారులకు జగన్ సూచించారు.