చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని కలసిన ఆర్ టి సి,ఆప్కాబ్ చైర్మన్లు…

ఆయా సంస్థల అభివృద్ధి అంశాలపై నూతన చైర్మన్ లతో చర్చించిన శ్రీకాంత్ రెడ్డి. విధాత‌:ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా బుధవారం రాయచోటిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఆర్ టి సి చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి,ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రెడ్డి లు కలిశారు. ఆర్ టి సి, ఆప్కాబ్ సంస్థల అభివృద్ధి అంశాలపైన నూతన చైర్మన్ లతో శ్రీకాంత్ రెడ్డి చర్చించారు. నూతనంగా చైర్మన్ పదవులు పొందిన ఇరువురికి చీఫ్ విప్ శుభాకాంక్షలు […]

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని కలసిన ఆర్ టి సి,ఆప్కాబ్ చైర్మన్లు…

ఆయా సంస్థల అభివృద్ధి అంశాలపై నూతన చైర్మన్ లతో చర్చించిన శ్రీకాంత్ రెడ్డి.

విధాత‌:ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా బుధవారం రాయచోటిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఆర్ టి సి చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి,ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రెడ్డి లు కలిశారు. ఆర్ టి సి, ఆప్కాబ్ సంస్థల అభివృద్ధి అంశాలపైన నూతన చైర్మన్ లతో శ్రీకాంత్ రెడ్డి చర్చించారు. నూతనంగా చైర్మన్ పదవులు పొందిన ఇరువురికి చీఫ్ విప్ శుభాకాంక్షలు తెలిపి దుస్సాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా తమకు పదవుల కేటాయింపులకు సహకరించినందుకు చీఫ్ విప్ కు నూతన చైర్మన్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరధ రామిరెడ్డి, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, డీసిసిబి డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎం పి పి బరుగు రెడ్డెన్న, యదుభూషన్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవుల నాగభూషన్ రెడ్డి,వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి వడ్డీ వెంకటరమణా రెడ్డి,నియోజక వర్గ బీసీ సెల్ కన్వీనర్ నాగరాజు యాదవ్, చిన్నమండెం సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ పలవలి అమర నాధ రెడ్డి, యర్రపురెడ్డి బ్రహ్మానంద రెడ్డి, లక్ష్మీకర్, లయన్ అశోక్ రెడ్డి, ఆర్ టి సి ఉద్యోగుల సంఘ నాయకుడు రామ్మోహన్, భాస్కర్ రెడ్డి, దేరంగుల రమేష్, మాజీ డి సి ఎం ఎస్ డైరెక్టర్ బుల్లి వెంకట రమణ , మోటకట్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.