ధూళిపాళ్ల బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్
★ సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ★ నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ వాదనలు వినిపించింది. ★ ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ★ తదుపరి విచారణ ఈ నెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ★ ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్‌లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ★ దర్యాప్తు అధికారులు ఇప్పటికే అవసరమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారని, […]

★ సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
★ నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ వాదనలు వినిపించింది.
★ ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
★ తదుపరి విచారణ ఈ నెల 23కు హైకోర్టు వాయిదా వేసింది.
★ ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్‌లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
★ దర్యాప్తు అధికారులు ఇప్పటికే అవసరమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారని, పిటిషనర్లు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నందున బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.
★ బెయిల్ నిమిత్తం విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషనర్లు ఇద్దరూ రూ.లక్ష చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది.
★ బెయిల్‌పై విడుదలైన తేదీ నుంచి 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.
★ పిటిషనర్లు నివాసం ఉండే చిరునామాను ఏసీబీ అధికారులకు ఇవ్వాలని సూచించింది.
★ దర్యాప్తులో భాగంగా పిటిషనర్లను విచారించాలని అధికారులు భావిస్తే 24 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని స్పష్టంచేసింది.