గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని… జూన్ 17 న‌ విజయవాడలోని ఎపిపిఎస్‌సి భవన్ ముట్టడిః రాగల ఆనంద్ గౌడ్

విధాత,తిరుప‌తిః ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకొని, గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ YCP ప్రభుత్వానిపై ధ్వజమెత్తారు. ఇది పరీక్షకు హాజరైన 9000 మంది గురించి మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజాస్వామ్య రక్షణకు సంభందించిన విషయమని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత రాజ్యాంగబద్ధంగా కాకుండా, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారంగా వైసీపీ ప్రభుత్వం విచచాలవిడిగా నడుపుతోందని ఆయన మండిపడ్డారు. […]

గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని… జూన్ 17 న‌ విజయవాడలోని ఎపిపిఎస్‌సి భవన్ ముట్టడిః రాగల ఆనంద్ గౌడ్

విధాత,తిరుప‌తిః ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకొని, గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ YCP ప్రభుత్వానిపై ధ్వజమెత్తారు. ఇది పరీక్షకు హాజరైన 9000 మంది గురించి మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజాస్వామ్య రక్షణకు సంభందించిన విషయమని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత రాజ్యాంగబద్ధంగా కాకుండా, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారంగా వైసీపీ ప్రభుత్వం విచచాలవిడిగా నడుపుతోందని ఆయన మండిపడ్డారు. అర్హత లేని వ్యక్తులను సభ్యులుగా చేర్చి గ్రామ/ వార్డు సచివాలయ పరీక్షలు దగ్గర నుంచి గ్రూప్ 1 పరీక్షల వరకు అనేక అక్రమాలు జరుపుతున్నారని తెలిపారు. తమ తప్పులు, అవకతవకలు కప్పిపుచ్చుకోడానికే ప్రభుత్వం కరోనా సమయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఆతృతగా ఏర్పాట్లు చేస్తోందని ఆరోపించారు.

డిజిట‌ల్ వేల్యూష‌న్ పై అభ్య‌ర్థులు వ్య‌క్తం చేస్తోన్న అనుమానాలు నివృత్తి చెయ్యాలని, మెయిన్స్ జవాబు ప‌త్రాల‌ను మాన్యువ‌ల్ వేల్యూష‌న్‌ చేయాలని, ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అంద‌రి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలని, డిజిటల్ వేల్యూష‌న్‌కి సంబంధించిన సాంకేతికత SOP పై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ దీనిపై జోక్యం చేసుకుని సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరారు ఏపీపీఎస్సీని వైసీపీఎస్పీగా మార్చేశారని అర్హత లేని వ్యక్తులను సభ్యులుగా చేసి దాన్ని రాజకీయ పునరావాస కేంద్రం చేశారని ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేయాలని కోరుతూ త్వరలో సేవ్ ఏపీపీఎస్సీ సేవ్ కాన్స్టెన్సీ ఉద్యమాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని రాజ్యాంగ బద్ధ సంస్థ ఇటువంటి ఏపీపీఎస్సీని తమ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాడుకుంటున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు

లేవనెత్తిన అన్నిఅంశాలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చేవరకు ఇంటర్వ్యూలను ఆపాలని కోరుతూ, ఇందుకు తెలుగు యువత కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వారి తదుపరి కార్యాచరణను ప్రకటించారు:-

● జూన్ 17 : విజయవాడలోని ఎపిపిఎస్‌సి భవన్ ముట్టడి, వెలుపల నిరసన కార్యక్రమాలు.