అమూల్ డెయిరీతో ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ
విధాత,అమరావతి: ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఆస్తులను అమూల్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించే ప్రభుత్వ జీవోను హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ చేసారు. అమూల్‌తో జరిగిన ఒప్పందంపై ఎలాంటి నిధులను ఖర్చు చేయొద్దని గతంలో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను జూలై 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని […]

విధాత,అమరావతి: ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఆస్తులను అమూల్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించే ప్రభుత్వ జీవోను హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ చేసారు. అమూల్‌తో జరిగిన ఒప్పందంపై ఎలాంటి నిధులను ఖర్చు చేయొద్దని గతంలో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశించింది.
ఈ ఉత్తర్వులను జూలై 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని ఎన్‌డీడీబీ కోరింది. మధ్యంతర ఉత్తర్వులపై తమ వాదనలు వినాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే కౌంటర్‌కు సమయం ఇచ్చాక వాదనలు వినలేమని ఏపీ హైకోర్టు పేర్కొంది.