కర్నూలు లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం
విధాత:భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం కర్నూలులో ఆదివారం జరుగుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధనరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న జలవివాదాలు, రాయలసీమ సాగునీటి సమస్యలు, తెలంగాణ ఏకపక్ష నిర్ణయంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, పోతిరెడ్డిపోడు కాలువలకు నీటి నిల్వలో అంతరాయం, ఆయకట్టు ప్రాంతాల […]

విధాత:భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం కర్నూలులో ఆదివారం జరుగుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధనరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న జలవివాదాలు, రాయలసీమ సాగునీటి సమస్యలు, తెలంగాణ ఏకపక్ష నిర్ణయంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, పోతిరెడ్డిపోడు కాలువలకు నీటి నిల్వలో అంతరాయం, ఆయకట్టు ప్రాంతాల సాగుకు నీరందడంతో ప్రతికూల పరిస్థితులు, రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తపరిస్థితులు, రాయలసీమ అభివృద్ధి చర్చ జరిపి భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.