ఎపీలో క్రైస్తవులకే ప్రాధాన్యత

విధాత‌: ఏపీలో ముస్లింలపై వివక్ష చూపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి సయ్యద్ ఇబ్రహీం విమర్శించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భాజపా పూర్వ జాతీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి, గవర్నర్, పద్మభూషణ్ సికిందర్భక్త జయంతి కార్యక్రమం భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సయ్యద్ ఇబ్రహీం.సికిందర భక్త చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ, ప్రభుత్వాలు పక్షపాతరహితంగా […]

ఎపీలో క్రైస్తవులకే ప్రాధాన్యత

విధాత‌: ఏపీలో ముస్లింలపై వివక్ష చూపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి సయ్యద్ ఇబ్రహీం విమర్శించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భాజపా పూర్వ జాతీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి, గవర్నర్, పద్మభూషణ్ సికిందర్భక్త జయంతి కార్యక్రమం భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సయ్యద్ ఇబ్రహీం.సికిందర భక్త చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ, ప్రభుత్వాలు పక్షపాతరహితంగా పాలించాలని, కాని ఎపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. హిందువులు, ముస్లింలను అణచివేస్తూ, క్రైస్తవులను వెనకేసుకువస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రిని విమర్శించారు.

సమాజంలోని మతాలు, వర్గాలు అందరూ కలసి కట్టుగా అభివృద్ధి సాధించాలనేది భాజపా అభిమతమని చెప్పారు. అందుకే “సబ్కా సాత్, సబ్కా వికాస్…. సబ్ కా ప్రయాస్” అనేది భాజపా నినాదంగా మారిందన్నారు. ఎన్నో పార్టీలున్నా భాజపా మాత్రమే మైనార్టీలను అక్కున చేర్చుకుని ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేంద్రమంత్రి వర్గంలో మైనార్టీలకు 4 మంత్రి పదవులు లభించాయని చెప్పారు. కాని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా భాజపా పట్ల ముస్లింలకు ద్వేషభావం కలిగేలా అసత్యప్రచారం చేస్తోందన్నారు.

సికిందర్ భక్తి గొప్ప దేశభక్తుడిగా కొనియాడుతూ, దేశంలో మైనార్టీల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేశారన్నారు. భాజపా గొప్పనాయకుల్లో ఒకరిగా సికిందర్భకు గుర్తుచేసుకున్నారు. భాజపా ప్రధాన కార్యదర్శులుగా అద్వానీ, మురళీమనోహర్ జోషిలతో కలసి సికిందర్భక్త పార్టీని ముందుకు తీసుకెళ్లారన్నారు. కష్టపడి పనిచేసేవారికి ఉన్నత స్థానం దక్కుతుందనేదానికి ఉదాహరణగా సికిందర్ భక్తి నిలుస్తారని, మైనార్టీ మోర్చా కార్యకర్తలంతా సికిందర్భక్త స్ఫూర్తితో పనిచేసి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని కోరారు.