పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్

విధాత,అమరావతి: సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), టెక్స్‌టైల్‌, స్పిన్నింగ్‌ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ₹1,124 కోట్లను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ‘‘ఎంఎస్‌ఎంఈలకు ₹440 కోట్లు, టెక్స్‌టైల్స్‌కు ₹684 కోట్లు ఇస్తున్నాం. ఎంఎస్‌ఎంఈలతో 10లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. పారిశ్రామిక రంగం క్షీణించకూడదనే సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెస్తున్నాం. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలతో 12లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వివక్ష, అవినీతి లేకుండా […]

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు  విడుదల చేసిన సీఎం జగన్

విధాత,అమరావతి: సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), టెక్స్‌టైల్‌, స్పిన్నింగ్‌ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ₹1,124 కోట్లను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ‘‘ఎంఎస్‌ఎంఈలకు ₹440 కోట్లు, టెక్స్‌టైల్స్‌కు ₹684 కోట్లు ఇస్తున్నాం. ఎంఎస్‌ఎంఈలతో 10లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. పారిశ్రామిక రంగం క్షీణించకూడదనే సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెస్తున్నాం. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలతో 12లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వివక్ష, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం’’ అని జగన్‌ తెలిపారు.