థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్

విధాత‌: థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సీఎం జగన్మో‌హన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయ్యేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సెకండ్ డోస్ వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. 94.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. […]

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్

విధాత‌: థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సీఎం జగన్మో‌హన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయ్యేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సెకండ్ డోస్ వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. 94.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. 4.98 లక్షల ఎకరాల్లో మాత్రమే ఇప్పటివరకు పంటలు వేశారని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.