Gunturu | కుటుంబ కలహాలు.. అత్త చెవిని కొరికిన కోడలు.. అతికించ‌లేమ‌న్న వైద్యులు

Gunturu | అత్తాకోడ‌ళ్ల మ‌ధ్య చోటు చేసుకున్న పంచాయితీ.. చివ‌ర‌కు ర‌క్తం క‌ళ్లారా చూసేదాకా వెళ్లింది. క్ష‌ణికావేశంలో కోడ‌లు( Daughter in Law ) త‌న అత్త( Mother in Law ) చెవిని కొరికేసింది. చెవి( Ear ) తెగిప‌డ‌డంతో అతికించ‌డం క‌ష్ట‌మ‌ని డాక్ట‌ర్లు ( Doctors )పేర్కొన్నారు.

Gunturu | కుటుంబ కలహాలు.. అత్త చెవిని కొరికిన కోడలు.. అతికించ‌లేమ‌న్న వైద్యులు

Gunturu | అమ‌రావ‌తి : కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో ఓ కోడ‌లు( Daughter in Law ) త‌న అత్త( Mother in Law ) చెవిని కొరికేసింది. దీంతో చెవి( Ear ) కొంతభాగం తెగిపోయింది. ఆ తెగిన చెవి భాగాన్ని అతికించ‌లేమ‌ని వైద్యులు( Doctors ) స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లా( Gunturu District )లోని తుళ్లూరులో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా( Gunturu District ) తుళ్లూరులో నివసిస్తున్న కంభంపాటి శేషగిరి, పావని(30) దంపతులకు ఇద్దరు కుమారులు.. కొన్ని రోజులుగా కోడలు పావనికి అత్త నాగమణి (55) కి మ‌ధ్య కుటుంబ కలహాల కారణంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పావని, నాగమణికి మ‌ధ్య ఆదివారం రాత్రి తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది.

దీంతో కొడలు పావని క్షణికావేశంలో అత్త నాగమణి చెవిని కొరికింది. అత్త చెవి భాగం మొత్తం తెగిపోయింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్థానికులు నాగమణిని తెగిన చెవితోపాటు తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఆలస్యం కావడంతో తెగిన చెవిని అతికించ‌డం కష్టమని వైద్యులు స్ప‌ష్టం చేశారు. దీంతో చేసేదేం లేక అక్కడే చికిత్సను కొనసాగిస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.