ఇది ఏపీ పోలీసులు, ప్రజలు గర్వించదగిన రోజు

విధాత‌: కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో ఏపీ అక్టోపస్‌ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మన గ్రేహౌండ్స్‌ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనిబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా అక్టోపస్‌ బలగాలను రీ లొకేట్‌ చేయాలని సూచించారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం […]

ఇది ఏపీ పోలీసులు, ప్రజలు గర్వించదగిన రోజు

విధాత‌: కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో ఏపీ అక్టోపస్‌ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మన గ్రేహౌండ్స్‌ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనిబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా అక్టోపస్‌ బలగాలను రీ లొకేట్‌ చేయాలని సూచించారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్‌ బలగాలు సేవలు అందిచనున్నాయి. గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుంది. నైట్‌ ఫైరింగ్‌ విషయంలో ఏపీ అక్టోపస్‌ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది అక్టోపస్‌ ఆఫీసర్లు ఉన్నారు. నైట్‌ ఫైరింగ్‌ విషయంలో ఏపీ అక్టోపస్‌ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు.