సీమకు గోదావరి సంధానం
విధాత:గోదావరిలో ఏడాదిలో 150-180 రోజులు వరద ఉంటుంది.. పోలవరం దిగువ నుంచి రోజుకు నాలుగు టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి.. అక్కడి నుంచి బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి పెన్నా నదికి తరలించాలన్నది ఆలోచన. అలాగే పెన్నా నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లో గోదావరి జలాలను ఎత్తిపోస్తే.. రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీటి సమస్య ఉండదు. జగన్ ప్రభుత్వం దీనిపై కూడా సీరియస్‌గా దృష్టి పెట్టాల్సి ఉంది. తెలంగాణ, ఏపీ […]

విధాత:గోదావరిలో ఏడాదిలో 150-180 రోజులు వరద ఉంటుంది.. పోలవరం దిగువ నుంచి రోజుకు నాలుగు టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి.. అక్కడి నుంచి బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి పెన్నా నదికి తరలించాలన్నది ఆలోచన. అలాగే పెన్నా నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లో గోదావరి జలాలను ఎత్తిపోస్తే.. రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీటి సమస్య ఉండదు. జగన్ ప్రభుత్వం దీనిపై కూడా సీరియస్‌గా దృష్టి పెట్టాల్సి ఉంది. తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టుగా దుమ్మగూడెం నుంచి 4 టీఎంసీలు గోదావరి జలాలు ఎత్తిపోసి నాగార్జున సాగర్‌లో 2 టీఎంసీలు, శ్రీశైలంలో రెండు టీఎంసీలు వేయాలని నాడు జగన్, కేసీఆర్ సంకల్పించారు. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్‌లో ప్రాదేశిక సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరించడంతో జగన్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అనుసంధానం పథకానికే స్వల్ప మార్పులు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్నివిస్తరించాలని జగన్ ప్రభుత్వం సంకల్పించగానే.. తాము నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నుంచి దృష్టి మళ్లించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఆ రాష్ట్ర మంత్రులు, నేతలు ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించడం మొదలుపెట్టారని నిపుణులు విమర్శిస్తున్నారు.