జగన్‌ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాడీవేడీగా వాదనలు

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాడీవేడీగా వాదనలు జ‌రిగాయి లిఖితపూర్వక సమాధానం ఇస్తామన్న జగన్ తరపు న్యాయవాదులు తిరస్కరించిన సీబీఐ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా విధాత‌:ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రఘురాజు దాఖలు చేసిన పిటిషన్ పై లిఖితపూర్వక సమాధానం ఇస్తామన్న జగన్ […]

జగన్‌ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాడీవేడీగా వాదనలు
  • జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాడీవేడీగా వాదనలు జ‌రిగాయి
  • లిఖితపూర్వక సమాధానం ఇస్తామన్న జగన్ తరపు న్యాయవాదులు తిరస్కరించిన సీబీఐ కోర్టు
  • తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా

విధాత‌:ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రఘురాజు దాఖలు చేసిన పిటిషన్ పై లిఖితపూర్వక సమాధానం ఇస్తామన్న జగన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.విచారణ సందర్భంగా రఘురాజు తరపు న్యాయవాదులు వాదిస్తూ… జగన్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేసినందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ కేసుల్లో సాక్షులుగా ఉన్న అధికారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. కేసుల్లో సహ నిందితులుగా ఉన్న వారికి కూడా ప్రయోజనాలను కల్పిస్తున్నారని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఇంతవరకు సీబీఐ తన అభిప్రాయాన్ని వెల్లడించకపోవడం సరికాదని అన్నారు.మరోవైపు జగన్ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ… రఘురాజుకు పిటిషన్ వేసే అర్హత కూడా లేదని అన్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే రఘురాజు పిటిషన్ వేశారని చెప్పారు. రఘురాజు పిటిషన్ పై లిఖితపూర్వక సమాధానం ఇస్తామని తెలిపారు. అయితే, ఆయన విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.