జాబ్ క్యాలెండర్ మారాలి: రామకృష్ణ
విధాత,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మక్దూమ్ భవన్‌లో ఏపీ నిరుద్యోగుల సమావేశం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరై మాట్లాడారు.‘ఏ ప్రభుత్వంలో లేని ఆశలు ఈ ప్రభుత్వంపైన ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని జగన్ చెప్పారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ ఉద్యోగాలు […]

విధాత,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మక్దూమ్ భవన్‌లో ఏపీ నిరుద్యోగుల సమావేశం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరై మాట్లాడారు.‘ఏ ప్రభుత్వంలో లేని ఆశలు ఈ ప్రభుత్వంపైన ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని జగన్ చెప్పారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ ఉద్యోగాలు తానే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. వాలంటీర్ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కింద చూపిస్తున్నారు. రాష్ట్రంలో 30 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ప్రకటించకుండా పది వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేస్తోందీ ప్రభుత్వం. విద్యార్థి, యువజన సంఘాల పోరాటం ఫలితంగా జాబ్ క్యాలెండర్ మారాలి’ అని రామకృష్ణ అన్నారు.