Kuwait victims Shiva | స్వస్థలం చేరుకున్న కువైట్ బాధితుడు శివ

కువైట్‌ ఎడారిలో ఎన్నో కష్టాలు పడ్డ తెలుగు వ్యక్తి శివ ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నాడు. ఏపీ మంత్రి నారా లోకేష్, కువైట్ తెలుగుదేశం పార్టీ చొరవతో బుధవారం కువైట్ నుంచి శివ క్షేమంగా స్వదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ వాల్మీకిపురం మండలం చింతపర్తిలోని బీసీ కాలనీలోని తన ఇంటికి చేరాడు

Kuwait victims Shiva | స్వస్థలం చేరుకున్న కువైట్ బాధితుడు శివ

ఆశ్చర్యానందాల్లో కుటుంబం

విధాత, హైదరాబాద్ : కువైట్‌ ఎడారిలో ఎన్నో కష్టాలు పడ్డ తెలుగు వ్యక్తి శివ ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నాడు. ఏపీ మంత్రి నారా లోకేష్, కువైట్ తెలుగుదేశం పార్టీ చొరవతో బుధవారం కువైట్ నుంచి శివ క్షేమంగా స్వదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ వాల్మీకిపురం మండలం చింతపర్తిలోని బీసీ కాలనీలోని తన ఇంటికి చేరాడు. ఇంటికి వచ్చిన శివను చూసిన భార్య, పిల్లలు తీవ్రభావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. శివ రాకతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంకు చెందిన శివ బ్రతుకు తెరువు కోసం కువైట్ కి వెళ్లి ఎజెంట్ల మోసంతో ఎడారిలో కష్టాలు పడుతూ.. నరక యాతన అనుభవించాడు.

చుట్టు ఎటు చూసిన ఎడారి తప్ప జనసంచారం లేని ఎడారి ప్రాంతంలో గొర్రెలు, పక్షులు, కోళ్లకు నీళ్లు, మేత పెట్టే పనులు చేస్తూ, కిలోమీటర్ల కొద్ది వాటికి ఎర్రటి ఎండలో నీళ్లు మోస్తూ ఆ పనులు చేయలేక, ఎండల్లో ఉండలేక, జ్వరమొస్తే పట్టించుకునే వాడులేక.. తన గోడు చెప్పుకునేందుకు మనిషి కూడా లేక నరకం అనుభవించాడు. చివరకు ఓ సెల్‌ఫోన్ వీడియోతో తన కష్టాలను వివరించి ఆదుకోవాలని వేడుకున్నాడు. తనను వెంటనే కాపాడకపోతే నాకు చావే శరణ్యమని కన్నీరు పెట్టుకున్నాడు. శివ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్పందించిన ఏపీ ప్రభుత్వం కువైట్ ఎంబసీని సంప్రదించి శివను స్వస్థలానికి చేర్చింది. కువైట్ బాధల నుంచి తనను విముక్తి చేసి తన కుటుంబం వద్ధకు చేర్చిన విదేశాంగ మంత్రిత్వ శాఖకు, ఏపీ ప్రభుత్వానికి, సహాయం చేసిన వారందరికి శివ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.