కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆందోళన

విధాత,విజయవాడ:ఆస్తి , నీటి, చెత్త పై పన్నులు రద్దు చేయాలని,విలువ ఆధారిత ఆస్తి పన్ను వల్ల ప్రజల పై పెను భారం పడుతుందని,198 జిఒ ను రద్దు చేయాలని కౌన్సిల్ లో ఆమోదం తెలపాలని, అధికారుల నిర్ణయాన్ని కౌన్సిల్ సభ్యులు అందరూ వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వామపక్షాల నేత‌లు ఆందోళన చేప‌ట్టారు. మోడి- జగన్ ప్రభుత్వాలు తెచ్చిన పన్నుల భారాలకు విజయవాడ కౌన్సిల్ ,పాలక పక్షం రబ్బర్ స్టాంప్ వేసి ఆమోదిస్తే చరిత్ర […]

కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆందోళన

విధాత,విజయవాడ:ఆస్తి , నీటి, చెత్త పై పన్నులు రద్దు చేయాలని,విలువ ఆధారిత ఆస్తి పన్ను వల్ల ప్రజల పై పెను భారం పడుతుందని,198 జిఒ ను రద్దు చేయాలని కౌన్సిల్ లో ఆమోదం తెలపాలని, అధికారుల నిర్ణయాన్ని కౌన్సిల్ సభ్యులు అందరూ వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వామపక్షాల నేత‌లు ఆందోళన చేప‌ట్టారు. మోడి- జగన్ ప్రభుత్వాలు తెచ్చిన పన్నుల భారాలకు విజయవాడ కౌన్సిల్ ,పాలక పక్షం రబ్బర్ స్టాంప్ వేసి ఆమోదిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.ప్రజాక్షేత్రంలో ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతమవుతుంది పేర్కొన్నారు.
ఆందోళ‌న‌కు దిగిన‌ సీపీఎం నేతలు ch.బాబూరావు, డివి కృష్ణా,డి. కాశీ నాథ్, సిపిఐ నేతలు శంకర్,కోటేశ్వరరావు 70 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.