వేగవంతంగా మదనపల్లి- పలమనేరు జాతీయ రహదారి పనులు

చిత్తూరు,విధాత‌ : మదనపల్లి- పలమనేరు జాతీయ రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పుంగనూరు సమీపంలో జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తో కలసి జాతీయ రహదారి నెంబర్ 42 పనుల గురించి అధికారులతో చర్చించారు. 2017 లో మదనపల్లి నుంచి పలమనేరు వరకు 54 కిలోమీటర్ల దూరం మంజూరు అయిన పుంగనూరు నగరంలోకి రాకుండా పది కిలోమీటర్ల లో […]

వేగవంతంగా మదనపల్లి- పలమనేరు జాతీయ రహదారి పనులు

చిత్తూరు,విధాత‌ : మదనపల్లి- పలమనేరు జాతీయ రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పుంగనూరు సమీపంలో జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తో కలసి జాతీయ రహదారి నెంబర్ 42 పనుల గురించి అధికారులతో చర్చించారు. 2017 లో మదనపల్లి నుంచి పలమనేరు వరకు 54 కిలోమీటర్ల దూరం మంజూరు అయిన పుంగనూరు నగరంలోకి రాకుండా పది కిలోమీటర్ల లో ఏర్పాటుచేసిన బైపాస్ రోడ్డు ద్వారా ఈ మార్గం ఉంటుంది. అయితే ఈ రోడ్డు పనులు పూర్తి కాకపోవడం పట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రెండు ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు మంత్రికి జిల్లా కలెక్టర్ కు చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఈ పనులు ప్రారంభించడం జరిగిందని ఆయన నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికే భూసేకరణకు సంబంధించి అన్ని అనుమతులు రావడం జరిగిందని ఉన్నారు. ఈ రోడ్డు కు మొత్తం 372.68 కోట్లతో మంజూరు అయిందని, ఇందుకు సంబంధించి 178 కోట్లు సివిల్ పనుల కోసం కేటాయించడం జరిగిందని అధికారులు మంత్రికి వెల్ల‌డించారు.