శ్రీశైలం మహాక్షేత్రంలో అర్ధరాత్రి డ్రోన్ డ్రోన్ల అలజడి

అనుమానాస్పద డ్రోన్ కెమరాలు రాత్రులపూట ఎగరటంపై పలు అనుమానాలుఅర్ధరాత్రి ఆకాశంలో నుంచి డ్రోన్ కెమారాలతో ఏమి జరుగుతుంది విధాత :శ్రీశైలం మహాక్షేత్రంలో రాత్రుల పూట ఆకాశంలో డ్రోన్ కెమెరాలు చెక్కర్లు కోడుతున్నాయి అనుమానాస్పదంగా డ్రోన్లు నాలుగురోజులుగా శ్రీశైలం చుట్టూ రాత్రులపూట తిరుగుతున్నాయి.అర్ధరాత్రి వరకు డ్రోన్ కెమెరాలు ఆకాశంలో హల్ చల్ చేస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. హైదరాబాదులో ఉగ్రవాదుల కదలికలు ఉన్న నేపథ్యంలో శ్రీశైలంలో గుర్తుతెలియని దుండగులు ఎవరైన మఖాం వేశారా లేకా గుప్తనిదుల ముఠాలు మఖాం […]

శ్రీశైలం మహాక్షేత్రంలో అర్ధరాత్రి డ్రోన్  డ్రోన్ల అలజడి

అనుమానాస్పద డ్రోన్ కెమరాలు రాత్రులపూట ఎగరటంపై పలు అనుమానాలు
అర్ధరాత్రి ఆకాశంలో నుంచి డ్రోన్ కెమారాలతో ఏమి జరుగుతుంది

విధాత :శ్రీశైలం మహాక్షేత్రంలో రాత్రుల పూట ఆకాశంలో డ్రోన్ కెమెరాలు చెక్కర్లు కోడుతున్నాయి అనుమానాస్పదంగా డ్రోన్లు నాలుగురోజులుగా శ్రీశైలం చుట్టూ రాత్రులపూట తిరుగుతున్నాయి.అర్ధరాత్రి వరకు డ్రోన్ కెమెరాలు ఆకాశంలో హల్ చల్ చేస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. హైదరాబాదులో ఉగ్రవాదుల కదలికలు ఉన్న నేపథ్యంలో శ్రీశైలంలో గుర్తుతెలియని దుండగులు ఎవరైన మఖాం వేశారా లేకా గుప్తనిదుల ముఠాలు మఖాం వేశారా అనే అనుమానాలు స్దానికులలో రెకెత్తుతున్నాయి గత నాలుగు రోజులుగా శ్రీశైలంలో రాత్రుల సమయంలో ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లను పట్టుకునేందుకు దేవస్థానం అధికారులు మరియు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నాలు చేసిన డ్రోన్లు హైస్పీడ్ లో తిరుగుతుండటంతో అధికారులకు శ్రీశైలంలో ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్దితిలో ఉన్నారు.

శ్రీశైలం ఆలయానికి త్రెట్ ఉన్నట్లు గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడ హెచ్చరికలు జారిచేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే తెలంగాణలో ఉగ్రవాదులు సంచరిస్తునట్లు కలకలం రేగింది. ఈ నేపథ్యంలో రాత్రి దేవస్థానం అధికారులు అటవీశాఖ సిబ్బంది దేవస్థానం సెక్యూరిటీ గార్డులు డ్రోన్లు ఎగిరే ప్రదేశాలలో వాటిని వెంబడించిన పట్టుకోలేకపోయారు.గత నాలుగు రోజుల కిందట శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు వద్ద విశ్వామిత్ర మఠంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధులు తవ్వకాలు జరిగినట్లు అధికారులకు సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు.అసలు క్షేత్ర పరిదిలో డ్రోన్లు ఎగరటంతో ఏమి జరుగుతుందోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.