అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై ఆరా తీసిన మంత్రి వనిత

విధాత,గుంటూరు: స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి తానేటి వనిత సమీక్ష నిర్వహించారు. గుంటూరులోని కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కమిషనర్ కృతికా శుక్లా, 13 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు లబ్దిదారులకు అందటంలో ఇబ్బందులపై సమీక్షలో చర్చించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించటంలో ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని మంత్రి సూచించారు.