ఇటువంటి పిచ్చి పనులు జరిగితే చంద్రబాబు నాయుడును చెంప పై చెల్లుమని కొడతా

విధాత‌: ఒక సామాన్య పౌరుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని,మంత్రుల‌పై అయ్య‌న్న‌పాత్రుడు విమర్శలు చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలియజేయడానికి తాడేపల్లి కరకట్ట వద్దకు వెళ్లగా చంద్రబాబునాయుడు గూండాలు వాళ్ళ అనుచరులు వాళ్ళ సామాజిక వర్గం నా మీద వైసీపీ నాయకుల మీద రాళ్లతో దాడి చేశార‌న్నారు ఎమ్మెల్యే జోగి రమేష్. గూండాలను సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇటువంటి లుచ్చా పనులు చేయటం సరైన పద్ధతి కాదు…సొంత మామనే రాళ్లతో చెప్పులతో కొట్టిన చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ పెట్టిన […]

ఇటువంటి పిచ్చి పనులు జరిగితే చంద్రబాబు నాయుడును చెంప పై చెల్లుమని కొడతా

విధాత‌: ఒక సామాన్య పౌరుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని,మంత్రుల‌పై అయ్య‌న్న‌పాత్రుడు విమర్శలు చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలియజేయడానికి తాడేపల్లి కరకట్ట వద్దకు వెళ్లగా చంద్రబాబునాయుడు గూండాలు వాళ్ళ అనుచరులు వాళ్ళ సామాజిక వర్గం నా మీద వైసీపీ నాయకుల మీద రాళ్లతో దాడి చేశార‌న్నారు ఎమ్మెల్యే జోగి రమేష్.

గూండాలను సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇటువంటి లుచ్చా పనులు చేయటం సరైన పద్ధతి కాదు…సొంత మామనే రాళ్లతో చెప్పులతో కొట్టిన చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని లాక్కొని ఆయనను అవమానించి దాడి చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు కి దక్కిందన్నారు.చంద్రబాబు నాయుడికి ఇదే ఆఖరి సారి చెప్పటం ఇంకోసారి ఇటువంటి ఘటన గాని జరిగితే మేము ఏంటో నీకు చూపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జోగి రమేష్.

చంద్రబాబు నాయుడు నువ్వు గుర్తుపెట్టుకో ఇది కేవలం ఆరంభం మాత్రమే భవిష్యత్తులో నువ్వు చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త అని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు…ఎమ్మెల్యే జోగి రమేష్ బిసిలకు ఎస్సీలకు వెనుకబడిన కులాలను ఆదుకొని అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరిత చర్యలతో ఇటువంటి పనులు చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదు.

చంద్రబాబు నాయుడికి మీడియా ముఖంగా ఒక మాట చెబుతున్నాను. ఇటువంటి పిచ్చి పనులు జరిగితే చంద్రబాబు నాయుడును చెంప పై చెల్లుమని కొడతా. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇకనుంచి జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే జోగి రమేష్.