టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ని కలిసిన ఎమ్మేల్యే ఆర్కే రోజా

విధాత‌:ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని ఎమ్మేల్యే ఆర్కే రోజా క‌లిశారు. నగరి నియోజకర్గంలో ఆలయాల నిర్మాణాలకు టీటీడి ద్వారా ఆర్థిక సహాయం పొందడానికి,తడుకు RS నుంచి అప్పలాయగుంట వరకు రోడ్డు వెడల్పు చేయడానికి,నిండ్ర లోని పురాతన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని విన్న‌వించారు. అలాగే ముడిపల్లి లోని అతి పురాతన అగస్తీశ్వర స్వామి ఆలయం, కరియ మాణిక్య స్వామి ఆలయాలను దేవస్థానం స్వాధీనం చేసుకోవాలని వెల్ల‌డించారు.నగరి దేశమ్మ ఆలయానికి దేవాదాయశాఖ కామన్ […]

టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ని కలిసిన ఎమ్మేల్యే ఆర్కే రోజా

విధాత‌:ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని ఎమ్మేల్యే ఆర్కే రోజా క‌లిశారు. నగరి నియోజకర్గంలో ఆలయాల నిర్మాణాలకు టీటీడి ద్వారా ఆర్థిక సహాయం పొందడానికి,తడుకు RS నుంచి అప్పలాయగుంట వరకు రోడ్డు వెడల్పు చేయడానికి,నిండ్ర లోని పురాతన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని విన్న‌వించారు.

అలాగే ముడిపల్లి లోని అతి పురాతన అగస్తీశ్వర స్వామి ఆలయం, కరియ మాణిక్య స్వామి ఆలయాలను దేవస్థానం స్వాధీనం చేసుకోవాలని వెల్ల‌డించారు.నగరి దేశమ్మ ఆలయానికి దేవాదాయశాఖ కామన్ గూడ్స్ నిధుల ద్వారా మంజూరు అయిన వాటికి టీటీడీ ద్వారా పనులు జరిపించాలని మొదలైన వాటికి వినతిపత్రం సమర్పించారు ఇతర అభివృద్ధి సంబంధిత ముఖ్యమైన విషయాలను ముఖాముఖి చర్చించారు.