నిరుద్యోగులకు ఉపాధి మరియు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఎంపీ రఘురామ లేఖాస్త్రం….
విధాత:ఎన్నికల్లో వైసీపి ప్రజలకు ఇచ్విన హామీల్లో ఇప్పటికీ అమలుకు నోచుకోని అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వరుస లేఖలు వ్రాస్తున్న నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనే అంశంపై ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ… సీఎం జగన్ కు లేఖ వ్రాసారు… 4 పేజీల ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగులకు కలగానే మిగిలిపోగిందని పేర్కొన్న రఘురామ, ఉగాదికి విడుదల చేస్తామన్న జాబ్ కేలెండర్ […]

విధాత:ఎన్నికల్లో వైసీపి ప్రజలకు ఇచ్విన హామీల్లో ఇప్పటికీ అమలుకు నోచుకోని అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వరుస లేఖలు వ్రాస్తున్న నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనే అంశంపై ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ… సీఎం జగన్ కు లేఖ వ్రాసారు…
4 పేజీల ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగులకు కలగానే మిగిలిపోగిందని పేర్కొన్న రఘురామ, ఉగాదికి విడుదల చేస్తామన్న జాబ్ కేలెండర్ ఎక్కడ అని ప్రశ్నించారు….
ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం నాడు ఇచ్చిన మాట నేటికీ అమలు జరగలేదని ప్రస్తావించారు… ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 75% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవో అమలుకు నోచుకోవడంలేదన్నారు రఘురామ…
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో 60 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయని స్వయంగా గవర్నర్ బిశ్వభూషణ్ గారే పేర్కొన్నారని… సదరు ఖాళీలను సత్వరం భర్తీ చేయాలని రాజ్ భవన్ ఆదేశాలు ఇచ్చి సంవత్సరం దాటుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు రఘురామ…