-ఎనిమిదేళ్ల బాలుడి కష్టాలు చూసి చలించిపోయిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి-అంధులైన తల్లిదండ్రులు, పసిబిడ్డలైన సోదరుల్ని ఆటో నడుపుతూ పోషిస్తోన్న 8 ఏళ్ల గోపాలరెడ్డి-తక్షణ ఆర్థిక సాయంగా 50 వేలు..చదువు బాధ్యత తీసుకుంటానని ప్రకటించిన నారా లోకేష్-ఆటో అప్పు తీర్చేందుకు మరో 2 లక్షలు పార్టీ నుంచి అందిస్తామని ప్రకటన విధాత:ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. కన్నవారిద్దరికీ కంటి చూపులేదు. పుట్టిన పిల్లలే వెలుగుదివ్వెలయ్యారు. కష్టాలు, కన్నీళ్లు..చుట్టూ ముసిరిన చీకట్లను చీల్చుకుంటూ…బడిలో అక్షరాలు దిద్దాల్సిన చేతులతో ఆటో […]
-ఎనిమిదేళ్ల బాలుడి కష్టాలు చూసి చలించిపోయిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
-అంధులైన తల్లిదండ్రులు, పసిబిడ్డలైన సోదరుల్ని ఆటో నడుపుతూ పోషిస్తోన్న 8 ఏళ్ల గోపాలరెడ్డి
-తక్షణ ఆర్థిక సాయంగా 50 వేలు..చదువు బాధ్యత తీసుకుంటానని ప్రకటించిన నారా లోకేష్
-ఆటో అప్పు తీర్చేందుకు మరో 2 లక్షలు పార్టీ నుంచి అందిస్తామని ప్రకటన
విధాత:ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. కన్నవారిద్దరికీ కంటి చూపులేదు. పుట్టిన పిల్లలే వెలుగుదివ్వెలయ్యారు. కష్టాలు, కన్నీళ్లు..చుట్టూ ముసిరిన చీకట్లను చీల్చుకుంటూ…బడిలో అక్షరాలు దిద్దాల్సిన చేతులతో ఆటో నడుపుతున్న చిత్తూరు జిల్లాకి చెందిన 8 ఏళ్ల బాలుడు గోపాలరెడ్డి కుటుంబానికి సాయం అందించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నడుం బిగించారు. తక్షణసాయంగా తానే 50 వేలు ఇస్తానని ప్రకటించారు. బ్యాటరీ ఆటో కోసం చేసిన అప్పు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ 2 లక్షల వరకూ సాయం అందించనుందని వెల్లడించారు. తల్లిదండ్రులు, గోపాలరెడ్డి కోరిక మేరకు ఏ స్కూల్లో చదవాలనుకుంటే అక్కడి విద్యాభ్యాసానికి అయ్యే మొత్తం ఖర్చు భరిస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఎనిమిదేళ్ల వయస్సులో కుటుంబబరువు బాధ్యతల్ని మోస్తోన్న బుడతడి కష్టాలు చూసి నారా లోకేష్ చలించిపోయారు. కళ్లులేని తల్లిదండ్రులు, లోకం పోకడ తెలియని ఇద్దరు తమ్ముళ్లకు తానే పెద్దదిక్కయిన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లె గ్రామానికి చెందిన గోపాలరెడ్డి బ్యాటరీ ఆటో నడుపుతూ అందులో పప్పులు, ఉప్పులు ఊరూరా తిరిగి అమ్ముతున్నారు. దీనిపై మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. ఇది చూసిన వెంటనే స్పందించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. చిట్టిచేతులతో గోపాలరెడ్డి ఇకపై ఆటో నడపాల్సిన అవసరం లేదు. ఆటోకి తీసుకున్న అప్పు తీరిపోనుంది. నచ్చినచోట చదివించేందుకు నారా లోకేష్ అన్ని చర్యలూ తీసుకుంటామని ప్రకటించారు. స్పందించే మనసున్న నారా లోకేష్ పార్టీ అధికారంలో లేదు.. కొంతమంది ప్రబుద్ధుల్లా అధికారంలోకొచ్చాక సాయం చేస్తానని ముద్దులు పెట్టి తప్పించుకోలేదు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న వెంటనే..పిల్లాడికి అవసరమైన సాయం తన సొంత డబ్బులతో అందించేందుకు ముందుకొచ్చారు. కష్టాలు తీరిపోవాలని టెంకాయలు కొట్టండని చెప్పే నేటి పాలకుల కన్నా…ఆపదలో వున్నారంటే ఆదుకుంటూ…కష్టంలో ఉన్నారంటే కదిలి వచ్చి సాయంగా నిలుస్తోన్న నారా లోకేష్ చేతులు మిన్న అంటున్నారు జనం.